ఆస్ట్రేలియా ప్రధానిని కలిసి ఇండియా, ఆస్ట్రేలియా జట్లు

సిడ్నీ: బోర్డర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌–గావస్కర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ట్రోఫీలో భాగంగా ఐదో టెస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు రెడీ అవుతున్న ఇండియా, ఆస్ట్రేలియా జట్లు బుధవారం ఆసీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్రధాని ఆంధోనీ అల్బనీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను కలుసుకున్నాయి. సిరీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో అద్భుతాలు చేస్తున్న స్పీడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌స్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జస్ప్రీత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బుమ్రాపై ఈ సందర్భంగా ప్రధాని ప్రశంసలు కురిపించారు. ‘బుమ్రా ఎడమ చేతితోనైనా బౌలింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేయాలి లేదంటే ఒక్క అడుగు వెనక్కి వేసేలా మేం చట్టం చేయాలి. బౌలింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు దిగిన ప్రతిసారీ అతను చాలా ఉత్సాహంగా కనిపిస్తాడు’ అని ప్లేయర్లతో ముచ్చటిస్తూ అల్బనీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వ్యాఖ్యానించారు.

 రెండు జట్లు అద్భుతమైన క్రికెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను చూపెట్టాయని కొనియాడారు. ‘ఐదో టెస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు వేదికైన సిడ్నీ గ్రౌండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మెక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గ్రాత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఫౌండేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు మద్దతుగా పింక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కలర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోకి మారిపోనుంది. మీరు కూడా మ్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు వెళ్లండి’ అంటూ మరో పోస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేశారు.