ఉప్పల్, వెలుగు: ఆరు నెలల కింద తాము దత్తత తీసుకుని అల్లారు ముద్దుగా పెంచుకుంటున్న పిల్లలను చైల్డ్వెల్ఫేర్ ఆఫీసర్లు తీసుకెళ్లారని, దయచేసి తమకు తిరిగి ఇప్పించాలని 10 కుటుంబాలు ఆదివారం ఉప్పల్ లో నిరసనకు దిగాయి. ఈ ఏడాది మే నెలలో చిన్న పిల్లల కిడ్నాప్ రాకెట్ అంటూ మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఇష్యూ జరగడంతో, పోలీసుల ద్వారా చైల్డ్ వెల్ఫేర్ కమిటీ పిల్లలను తీసుకెళ్లారని తెలిపాయి. అప్పటి నుంచి పిల్లల కోసం న్యాయ పోరాటం చేస్తున్నామన్నాయి. సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి సీతక్క స్పందించి తమకు న్యాయం చేయాలని వేడుకున్నాయి.