పెండింగ్ బిల్లులుచెల్లించాలి

  •   సర్పంచుల సంఘం జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు యాదయ్యగౌడ్

హైదరాబాద్, వెలుగు: పంచాయతీల్లో మాజీ సర్పంచులు సొంత డబ్బులతో అభివృద్ధి పనులు చేపట్టారని, ఇప్పటికి పెండింగ్ బిల్లులు చెల్లించలేదని సర్పంచుల సంఘం జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు సుర్వి యాదయ్య గౌడ్ అన్నారు. గురువారం అసెంబ్లీలోని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చాంబరులో ఆయనను కలిసి వినతి పత్రం అందిచారు. 

ఈ సందర్భంగా యాదయ్య గౌడ్ మాట్లాడుతూ.. మాజీ సర్పంచులు తెచ్చిన అప్పులకు వడ్డీలు కట్టలేకపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేలోపే పెండింగ్ బిల్లులు చెల్లించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జేఏసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాంపాక నాగయ్య, రాష్ట్ర ఉపాధ్యక్షుడు మధు సూదన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.