IND Vs BAN 2024: మూడో రోజ ముంచిన వర్షం.. డ్రా దిశగా కాన్పూర్ టెస్ట్

కాన్పూర్ టెస్టుకు మూడో రోజు వర్షం వర్షం అంతరాయం కలిగించింది. బంతి కూడా పడకుండానే ఆట తుడిచిపెట్టుకుపోయింది. ఉదయం భారీ వర్షం కురవడంతో మ్యాచ్ ప్రారంభం కాలేదు. ఆ తర్వాత వరుణుడు శాంతించిన ఔట్ ఫీల్డ్ చిత్తడిగా ఉండడంతో గ్రౌండ్  మ్యాచ్ రద్దు చేస్తున్నట్టు అంపైర్లు ప్రకటించారు. గ్రీన్ పార్క్ స్టేడియంకు డ్రైనేజ్ వ్యవస్థ లేకపోవడం ప్రతికూలంగా మారింది. దీంతో ఈ టెస్ట్ డ్రా అయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. మరో రెండు రోజుల ఆట మాత్రమే మిగిలి ఉంది. 

మూడు రోజుల్లో 35 ఓవర్ల ఆట మాత్రమే జరగడడంతో మిగిలిన రెండో రోజులు పూర్తి ఆట సాగిన ఫలితం రావడం కష్టమే. మ్యాచ్ చూసి ఎంజాయ్ చేద్దామనుకున్న అభిమానులకు నిరాశ తప్పడం లేదు. తొలి రోజు కేవలం 35 ఓవర్ల ఆట మాత్రమే సాధ్యపడింది. రెండో రోజు బంతి పడకుండానే వర్షం కారణంగా మ్యాచ్ జరగలేదు. బంగ్లాదేశ్ తొలి రోజు ఆట ముగిసేసమయానికి మూడు వికెట్ల నష్టానికి 107 పరుగులు చేసింది. మోమినుల్ హక్ (40), రహీం (6) క్రీజ్ లో ఉన్నారు. భారత బౌలర్లలో ఆకాష్ దీప్ కు రెండు.. అశ్విన్ కు ఒక వికెట్ దక్కింది. 

Also Read :- బంగ్లాదేశ్‌తో టీ20 సిరీస్

రెండో టెస్ట్ మ్యాచ్ ల సిరీస్ లో భారత్ 1-0 ఆధిక్యంలో నిలిచింది. మ్యాచ్ రద్దయితే 1-0 తేడాతో భారత్ సిరీస్ గెలుస్తుంది. అదే జరిగితే రోహిత్ సారధ్యంలోని భారత క్రికెట్ జట్టు ఇప్పటివరకు టెస్ట్ సిరీస్ ఓడిపోని రికార్డ్ కొనసాగనుంది. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ లో భాగంగా ఈ మ్యాచ్ రద్దయిత్ బలహీనమైన బంగ్లాదేశ్ పై గెలవాల్సిన మ్యాచ్ డ్రా చేసుకొని భారత్ కీలకమైన 6 పాయింట్లు కోల్పోనుంది.