2024 ఎన్నికల్లో సీఎం జగన్ ఓటమి ఖాయమంటూ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ చేసిన వ్యాఖ్యలు అటు ఎలక్ట్రానిక్ మీడియా, ఇటు సోషల్ మీడియాను ఊపేస్తున్నాయి . 2019 ఎన్నికల్లో జగన్ గెలుపులో కీలకపాత్ర పోషించిన ప్రశాంత్ కిషోర్ ఈ వ్యాఖ్యలు చేయటం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. పీకే కామెంట్స్ ప్రతిపక్ష టీడీపీ, జనసేన కూటమి ప్రచారాస్త్రంగా వాడుకుంటోంది. ఇక జగన్ పని ఐపోయిందంటూ సోషల్ మీడియాలో విస్తృతంగా పీకే వ్యాఖ్యలను వైరల్ చేస్తున్నాయి. " వై నాట్ 175 " అంటూ సీఎం జగన్ వరుస బహిరంగ సభలతో దూసుకుపోతున్న నేపథ్యంలో పీకే వ్యాఖ్యలు వైసీపీ శ్రేణులను సైతం కలవరపెడుతున్నాయి.
ఓ మీడియా ఇంటర్వ్యూలో పాల్గొన్న పీకే సంక్షేమ పథకాలు, అభివృద్ధి గురించి ప్రస్తావిస్తూ, కేవలం సంక్షేమ పథకాలు మాత్రమే అమలు చేస్తే సరిపోదని, అభివృద్ధి కూడా చేయాలని అన్నాడు. అభివృద్ధి చేయకపోతే జనాలు ఓట్లు వేయరని, ఈ విషయంలో జగన్ చాలా పెద్ద తప్పు చేశారని అన్నారు. వచ్చే ఎన్నికల్లో జగన్ కు ఘోర ఓటమి ఖాయమని అన్నాడు.
పీకే వ్యాఖ్యలతో ప్రతిపక్షాలు పండగ చేసుకుంటుంటే, వైసీపీ శ్రేణులు మాత్రం పీకే వ్యాఖ్యలను తిప్పి కొడుతున్నారు. మొన్న జరిగిన తెలంగాణ ఎన్నికలతో సహా పలు రాష్ట్రాల ఎన్నికల్లో పీకే ప్రెడిక్షన్ ఫలించలేదని, అతని సొంత రాష్ట్రంలో, సొంత పార్టీకి డిఏపిజిట్లు కూడా తెచ్చుకోలేకపోయాడని కామెంట్స్ చేస్తున్నారు. మొత్తానికి ఏపీలో పొలిటికల్ హీట్ ని రెట్టింపు చేస్తున్న పీకే కామెంట్స్ ఏ మేరకు ప్రభావం చూపుతాయో చూడాలి.