పిఠాపురం బరిలో నేనే ఉంటా - వర్మ

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏ క్షణాన తాను పిఠాపురం నుండి పోటీ చేస్తానని అనౌన్స్ చేశాడో కానీ, అప్పటి నుండి స్థానిక టీడీపీ నుండి అసమ్మతి ఒక పక్క, పార్టీ నుండి ఫిరాయింపులు మరొక పక్క వెరసి జనసేన శ్రేణులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఇక, ఇటీవల పైఠాపురంలో జరిగిన కార్యకర్తల సమావేశంలో పవన్ చేసిన వ్యాఖ్యలు జనసైనికులను మరింత అయోమయంలోకి నెట్టేశాయి. కేంద్రంలోని పెద్దలు ఆదేశిస్తే కాకినాడ ఎంపీగా పోటీ చేస్తానని, పిఠాపురం బరిలో ఉదయ్ ఉంటాడని పవన్ అన్నారు.

పవన్ వ్యాఖ్యలతో జనసైనికులు అయోమయంలో పడ్డ నేపథ్యంలో టీడీపీ నేత వర్మ సంచలన వ్యాఖ్యలు చేసారు. పవన్ కళ్యాణ్ కాకినాడ ఎంపీగా పోటీ చేస్తే, పిఠాపురం అసెంబ్లీ బరిలో తాను పోటీ చేస్తానని అన్నాడు. చంద్రబాబు ఆదేశాలతో పవన్ కళ్యాణ్ గెలుపు కోసం కృషి చేయాలని పిఠాపురం అసెంబ్లీ బరిలో నుండి తప్పుకున్నానని, ఇప్పుడు పవన్ ఎంపీగా పోటీ చేస్తే గనక పిఠాపురం అసెంబ్లీ బరిలో నిలుస్తానని వర్మ అన్నారు. ఒక పక్క అధికార వైసీపీ అభ్యర్థుల జాబితా ప్రకటించి రేసులో ముందుకు దూసుకుపోతుంటే టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి మాత్రం ఇంకా సీట్ల సర్దుబాషలోనే తర్జనభర్జన పడుతున్నాయి.

ALSO REAd :- వైద్య ఆరోగ్యశాఖలో 5348 పోస్టులకు ఆర్థికశాఖ గ్రీన్ సిగ్నల్