తిరువనంతపురం: కేరళ ముఖ్యమంత్రిగా పినరయి విజయన్ రెండోసారి ప్రమాణం స్వీకారం చేశారు. గవర్నర్ ఆరీఫ్ అహ్మద్ ఖాన్ గురువారం ఆయనతో ప్రమాణం చేయించారు. సెంట్రల్ స్టేడియంలో కొద్ది మంది అతిధుల మధ్య ఈ ప్రమాణస్వీకార కార్యక్రమం జరిగింది. ముఖ్యమంత్రి విజయన్‌తో పాటు మంత్రులు కూడా ప్రమాణం స్వీకారం చేశారు. కరోనా నిబంధనలు ఉల్లంఘిస్తున్నారన్న విమర్శల నేపధ్యంలో అనుమతి లేని అతిధులను వెనక్కి పంపారు. కేవలం మంత్రివర్గ సభ్యులు, వారి సెక్యూరిటీ మరియు సహాయ సిబ్బందిని మాత్రమే అనుమతించారు.
ప్రమాణ స్వీకారం చేసిన మంత్రులు వారి శాఖల వివరాలు ఇలా ఉన్నాయి.
వి.శివన్ కుట్టి (విద్యాశాఖ), ఆంటోని రాజు (రవాణాశాఖ) వీణా జార్జి (ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమం), జి.ఆర్.అనిల్ (ఆహారం మరియు పౌర సరఫరాలు), సాజి చెరియన్ (మత్స్యశాఖ, సినిమా మరియు సాంస్కృతిక విభాగం), పి.ప్రసాద్ (వ్యవసాయశాఖ), వి.ఎన్.వాసవ (రిజిస్ట్రేషన్లు మరియు కో-ఆపరేటివ్ సొసైటీలు), రోషి అగస్టీన్ (నీటి వనరులు), పి.రాజీవ్ (పరిశ్రమలు, వాణిజ్యం మరియు న్యాయశాఖ), కె.రాధాకృష్ణన్ (వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ), కె.రాజన్ (రెవెన్యూ), కె.కృష్ణ కుట్టి (విద్యుత్), ఎ.కె.శశిధరన్ (అటవీ శాఖ), ఎం.వి.గోవిందన్ (ఎక్సైజ్ మరియు స్థానిక సంస్థలు), పి.ఎ.మహమ్మద్ రియాస్ (టూరిజం), అహ్మద్ దేవర్ కోవిల్ (నౌకాశ్రయాలు, పురావస్తు శాఖ), వి.అబ్దుర్ రహమాన్ (క్రీడలు మరియు మైనారిటీ సంక్షేమ శాఖ), జె.చించురాణి (పశుసంవర్ధక శాఖ, పాల డైరీలు, పాల సహకార సంఘాలు), ఎం.బి.రాజేష్ (స్పీకర్), చిట్టాయం (డిప్యూటీ స్పీకర్).
