Lifestyle: పిలాటీస్ వ్యాయామం..సెలబ్రెటీస్​ ఫిట్​నెస్ స్టైల్​

యంగ్​ క్రికెటర్​ హార్ఢిక్​ పాండ్యా ..  వర్కవుట్స్ ఒక చేస్తున్న వీడియోని ఇన్​ స్ట్రాగ్రామ్​ లో  పెట్టి, , 'ఈ వ్యాయామం చేయడం అంత సులభం కాదు అని క్యాప్షన్ పెట్టాడు... అలాగే హీరోయిన్ పూజా హెగ్డే ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ' ఈ వ్యాయామం వల్ల శరీరం దృఢంగా మారుతుంది.  డ్యాన్స్ చేసేటప్పుడు ఫ్లెక్సిబుల్ గా అనిపిస్తుంది. దీనివల్ల మానసికంగానూ ఎన్నో ప్రయోజనాలున్నాయి" అని చెప్పింది. ఇంతకూ వీళ్లిద్దరూ చెప్పింది ఏ వ్యాయామాల గురించి? సెలబ్రిటీలు కూడా ఫాలో అవుతున్న ఈ ఫిట్​ నెస్ స్టైల్ ఏంటో తెలుసుకుందాం. . .

పాండ్యా, పూజా మాత్రమే కాదు. .. చాలామంది ఫాలో అవుతున్న కొత్త ఫిట్ నెస్ స్టైల్ పిలాటీస్ . .. ఇది  విదేశాల్లో చాలా పాపులర్ ఫిట్ నెస్ స్టైల్.   ఇప్పుడిప్పుడే మనదేశంలో కూడా పాపులర్ అవుతోంది. పిలాటీస్ అనేది ఒక సిస్టమాటిక్ ప్లో కలిగి ఉండే ఎక్సర్ సైజులు. కోర్ స్ట్రింగ్, ఫ్లెక్సిబిలిటీ షోక్చర్స్ ను ఇంప్రూవ్​చేస్తూనే మెంటల్ అవేర్​ నెస్ ను కూడా పెంచడం ఈ ఫిట్ నెస్ స్టైల్ స్పెషాలిటీ.   అందుకే చాలామంది ఈ వ్యాయామాల్ని చేయడానికి ఇష్టపడుతున్నారు.

ALSO READ | Health: రాంగ్​ డైటింగ్​.. ఆరోగ్యానికి విలన్

 ఈ వ్యాయామాల్ని జోసెఫ్ పీలాటీ అనే ఫిటినెస్ ట్రైనర్ రూపొందించారు. ఆయన పేరు మీరే వీటికి పిలాటిస్ అనే పేరొచ్చింది. వీటినే పైలేట్స్ అని కూడా అంటారు. పిలాటీస్​ లో...  మ్యాటీ  పిలాటీస్, కాంటెంపరరీ  స్టూడియో పిలాటీస్, గ్రూప్ రిఫార్నర్ పిలాటీస్, క్లినికల్ పిలాటీస్, క్లాసికల్ పిలాటిస్ అని ఐదు రకాలున్నాయి. పిలాటీస్​ లో  చేసే వ్యాయామాలన్నీ యోగా వ్యాయామాలు మాదిరిగానే ఉంటాయి. అయితే యోగాలో ఫ్లెక్సిబిలిటీ మీద ఎక్కువ ఫోకస్​ ఉంటే పిలాటీస్​ లో మజిల్​ని రిలాక్స్ చేసి, స్ట్రెంత్ పెంచే వ్యాయామాలుంటాయి.

రోల్ అప్

ఈ వ్యాయామాన్ని నేలమీద కానీ, మ్యాట్ మీద కానీ పడుకొని చేయాలి. ముందుగా నేలపై వెల్లకిలా పడుకుని  మోకాళ్ళు మడిచి, చేతులతో బలంగా తల దగ్గరకు తీసుకురావాలి. తలను కూడా వీలైనంత ముందుకి వంచాలి. ఇది రోటివ్ స్టార్టింగ్ పొజిషన్ ఈ పొజీషన్​ లో  కాసేపు ఉండి తర్వాత రెండు కాళ్లు రిలీజ్ చేయాలి. ఇప్పుడు లేచి కూర్చొని, కాళ్లు, చేతులు సమాంతరంగా ముందుకి చాపాలి. ఇది రోల్అప్ ఎండింగ్ పొజిషన్. ఇలా స్టార్టింగ్, ఎండింగ్ పొజిషన్స్ ను చేస్తూ ఉండాలి. ఇలా నాలుగైదు సార్లు చేయొచ్చు. ఈ వ్యాయామం వల్ల వ్యాక్ కండరాలకు మంచి ఎక్సర్సైజ్ అందుతుంది. కోర్ మజిల్స్, పొట్ట కండరాలు కూడా గట్టిపడతాయి.

నీలింగ్ సైడ్ కిక్

ఈ వ్యాయామంలో ముందుగా మోకాళ్ళమీద కూర్చోవాలి. తర్వాత ఒక చేతిని కింద పెట్టి, ఒక పక్కకు వంగాలి. ఇప్పుడు ఒక కాలును స్ట్రైట్​గా  చాపాలి అలాగే రెండో కాలిని మడిచి వెనుకకు  స్ట్రైట్​ గా  చాపాలి. రెండో చేతిని సెల్యూట్ చేస్తున్నట్టు పెట్టాలి. అప్పర్ బాడీ మంచి అరికాలి వరకు ఒకే లైన్లో ఉండేలా పోశ్చర్ సరిచూసుకోవాలి. ఇలా చేసిన తర్వాత "మళ్లీ కాలుని నార్మల్ పొజిషను తెచ్చి ఈసారి రెండో కాలితో వ్యాయామాన్ని రిపీట్ చేయాలి. ఈ వ్యాయామం' వల్ల కోర్ మారి ప్రాంతం పెరుగుతుంది. బాడీ బ్యాలెన్సింగ్ కూడా ఇంప్రూప్ అవుతుంది.

సింగిల్ లెగ్ సర్కిల్

నేలపై వెల్లకిలా పడుకుని ఒక కాలిని కొంత ఎత్తు వరకు  పైకి లేపాలి. మోకాలు బెండ్ అవ్వకుండా స్రైట్​గా ఉండేలా చూసుకోవాలి. తర్వాత కాలితో గాలిలో సర్కిల్​ గీయాలి. అంటే కాలిని రౌండ్ గా తిప్పాలి. ఇలా కాళ్లు మారుస్తూ ఈ వ్యాయామం చేయాలి. దీన్ని చేయడం వల్ల పొట్ట, కాలి కండరాలు స్ట్రెచ్ అవుతాయి.

స్ఫైన్​ ట్విస్ట్​

స్క్రీన్ ట్విస్ట్ వ్యాయామంలో కింద కూర్చొని, రెండు కాళ్లు ముందుకి చాపి  రెండు చేతులు సమాంతరంగా చాపాలి. తర్వాతచేతులు అలాగే ఉంచి బాడిని అటు ఇటు ట్విస్ట్ చేయాలి. దీని వల్ల అప్పర్ బాడీ ఫ్లెక్సిబిలిటీ పెరుగుతుంది. అలాగే వెన్నెముక రిలాక్స్ అవుతుంది

సీల్ పోజ్

ఈ వ్యాయామాన్ని నేలమీద కూర్చొని చేయాలి. ముందుగా రెండు పాదాలను దగ్గరకు తీసుకొచ్చి తరువాత రెండు చేతులతో కాళ్ళను పట్టుకోవాలి. ఇలా పట్టుకున్న తర్వాత అరికాళ్లతో చప్పట్లు కొట్టాలి. ఇలా కాసేపు చేసిన తర్వాత కాళ్లు అలాగే పట్టుకుని, వెనక్కి పడుకోవాలి. అలా పడుకున్న తర్వాత మళ్లీ కాళ్ళను పట్టుకుని చప్పట్లు కొట్టాలి. ఇలా సీల్ వ్యాయామాన్ని రిపీట్. చేయాలి. ఈ వ్యాయామం వల్ల బ్యాక్, హ్యామ్ స్ట్రింగ్ కండరాలకు నుంచి ఎక్సర్ సైజ్ అందుతుంది

 ఫిట్​ నెస్​ ట్రైనర్​ బాబీ తెలిపిన వివరాల ప్రకారం..పిలాటీస్ వల్ల ఇంకా ఎలాంటి ఉపయోగాలున్నాయంటే

  •  ఇంజురీస్ నుంచి త్వరగా రికవరీ అయ్యేందుకు ఈ వ్యాయామాలు బాగా ఉపయోగపడతాయి. 
  •  వీటివల్ల కోర్ ఫ్రెంత్ బాగా ఇంప్రూవ్​  అవుతుంది. బాడీ ఫ్లెక్సిబిలిటీ, బ్యాలెన్సింగ్​ కూడా పెరుగుతాయి. 
  • శరీరంలో కోర్ మజిల్స్ అన్నీ అవుతాయి.   పిలాటీస్​ వ్యాయామాలు మెదడునుప్రశాంతంగా ఉండేలా చేస్తాయి. అందుకే దీని వల్ల ఒత్తిడి, ఆందోళనలు తగ్గుతాయి.
  • ఇంచ్​ లాస్​  అండ్ వెయిట్ లాస్, రెండింటికీ ఈ వ్యాయామాలు మంచివి. 
  • కోర్ మజిల్స్ అన్నీ గట్టిపడతాయి. బ్యాక్. స్పైన్​  కండరాలపై కంట్రోల్ వస్తుంది.
  • ఈ పిలాటీస్ కండరాల, కీళ్ల బలం.. వాటి ఫ్లెక్సిబిలిటీని మెరుగుపరుస్తాయి. వెన్నముక. హామ్ స్టింగ్స్, హిప్స్, ఫ్రంట్ బాడీ, సైడ్ బాడీ ఫ్లెక్సిబిలిటీ ని పెంచుతుంది.ఈ వ్యాయామాలు కండరాల బలాన్ని
  • పెంచడమే కాకుండా టోన్ చేస్తాయి..
  •  పిలాటీస్ వ్యాయామాలు ఊపిరితిత్తుల సామర్థ్యాన్ని మెరుగుపరుస్తాయి. దాని వల్ల మెదడుకు ఆక్సిజన్ శాతం పెరుగుతుంది.
  •  పిలాటిస్ వ్యాయామాలు చేస్తున్నప్పుడు బాడీ మూమెంట్స్ పై ఫోకస్ చేయాల్సి ఉంటుంది. అందుకే దీనివల్ల ఏకాగ్రత,అవగాహన పెరుగుతాయి. బాడీ మైండ్ కనెక్షన్ కూడా ఇంప్రస్ అవుతుంది.
  •  పిలాబీస్ వ్యాయామంలో ఏదైనా ఇబ్బంది. అనిపిస్తే.. డాక్టరు లేదా ఫిట్ నెస్ ట్రైనర్​ను సంప్రదిస్తే మంచిది.
‌‌–వెలుగు.. లైఫ్​–