మెదక్​ జిల్లాలో పందుల దొంగల అరెస్ట్

కొండపాక(కుకునూర్ పల్లి), వెలుగు : పందుల దొంగలను అరెస్టు చేసి రిమాండ్​కు తరలించినట్లు ఏసీపీ పురుషోత్తం తెలిపారు. సోమవారం కుకునూర్ పల్లి పీఎస్​లో వివరాలు వెల్లడించారు. కొడకండ్ల, కుక్కునూరు పల్లి, వర్గల్, గౌరారం, వర్గల్, అంగడి కిష్టాపూర్, మిట్టపల్లి గ్రామాల్లో గత నెల రోజుల నుంచి 200 పందులకు పైగా చోరీ జరిగినట్లు కంప్లైంట్​వచ్చిందన్నారు. సోమవారం ఉదయం వెలికట్ట అడ్డ రోడ్డు వద్ద  పోలీసులు వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా పందులను తరలిస్తున్న వాహనాన్ని ఆపారు. 

వాహనంలో ఉన్న భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన మూడ సురేశ్ (32), నల్గొండ రాము(32) , మెడ వీరన్న (26), నల్గొండ వీరన్న (26) ను అదుపులోకి తీసుకొని విచారించగా దొంగతనం చేసినట్లు ఒప్పుకున్నారు. నిందితుల నుంచి రూ.75 వేల నగదు, అశోక్​లేలండ్​వాహనాన్ని స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. కాగా మరో ఇద్దరు నిందితులు నూనె రమేశ్, షాదుల్ల పరారీలో ఉన్నట్లు ఏసీపీ వెల్లడించారు.