ఫీచర్స్ ఇవే: రూ.5 వేల డౌన్ పేమెంట్ తో 1.26 లక్షల స్కూటర్

ఫీచర్స్ ఇవే: రూ.5 వేల డౌన్ పేమెంట్ తో 1.26 లక్షల స్కూటర్
పూణె: పియాజియో ఇండియా ప్రీమియం నుంచి  ఏప్రిలియా ఎస్‌ఎక్స్‌ఆర్‌ 160 అనే కొత్త స్కూటర్ ను భారత్ లో లాంచ్ చేసింది సంస్థ. స్కూటర్ ప్రారంభ ధర రూ. 1,25,997 (ఎక్స్‌షోరూమ్‌–పూనె)గా నిర్ణయించామని.. దేశ వ్యాప్తంగా అన్ని డీలర్‌షిప్‌ల దగ్గర, తమ వెబ్‌సైట్‌ ద్వారా కూడా బుకింగ్‌ చేసుకోవచ్చని తెలిపింది. సింగిల్ సిలిండర్ 4 స్ట్రోక్ ఇంజిన్ కలిగిన ఈ స్కూటర్ 7100 ఆర్పీఎం వద్ద 11 పీఎస్ శక్తిని ఉత్పత్తి చేస్తుందని..  ఏడు లీటర్ల ట్యాంకు కెపాసిటీ ఉందని చెప్పింది. యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్, వెంటిలేటెడ్ డిస్క్ బ్రేక్, డిజిటల్ స్పీడ్ ఇండికేటర్ మినిమమ్, హై స్పీడ్ డిస్ ప్లే, డిజిటల్ ఫ్యూయల్ ఇండికేటర్, ఇంజిన్ మాల్ ఫంక్షన్ ఇండికేటర్ వంటి టెక్నాలజీ ఫీచర్లు ఈ స్కూటర్ లో ఉన్నాయని తెలిపింది సంస్థ. కావాలనుకున్నప్పుడు స్కూటర్ ను మొబైల్ కు కనెక్ట్ చేసే టెక్నాలజీని ఈ స్కూటర్ లో అమర్చామని తెలిపింది. దీంతో వాహన భద్రత పెరగనుందని తెలిపింది కంపెనీ. ఏప్రిలియా ఎస్ఎక్స్ఆర్160 సరికొత్త టెక్నాలజీతో పాటు మంచి ప్రయాణ అనుభూతిని అందిస్తుందని తెలిపారు పియాజియో ఇండియా చైర్మైన్ ఎండీ డియాగో గ్రాఫీ. షోరూమ్స్, ఆన్ లైన్ లో ఈ స్కూటర్ ను బుక్ చేసుకోవచ్చని.. జస్ట్ రూ.5 వేలు డౌన్ మేమెంట్ తో బుక్ చేసుకునే బంపర్ ఆఫర్ ను కల్పించామని తెలిపారు.  ఈ–కామర్స్‌ వెబ్‌సైట్‌ https://apriliaindia.com/