ఫుట్​బాల్​ టోర్నీకి స్టూడెంట్స్ ఎంపిక

గద్వాల, వెలుగు: అంతర్​ జిల్లా సబ్ జూనియర్ ఫుట్​బాల్​ టోర్నీకి  ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల స్టూడెంట్స్ మౌనిక, శ్రీవిద్య, స్వాతి ఎంపికైనట్లు ఫిజికల్ డైరెక్టర్ స్రవంతి తెలిపారు. ఈనెల 12 నుంచి 14వ  వరకు కల్వకుర్తిలో జరిగే   టోర్నమెంట్ లో   వీళ్లు పాల్గొంటారని చెప్పారు.

 సెలక్షన్ ట్రయిల్స్ వనపర్తి జిల్లా పెబ్బేరు లో జులై 7 న జరిగాయని తెలిపారు.  ఎంపికైన స్టూడెంట్స్​ను   హెడ్ మాస్టర్ జహురుద్దీన్,  ఫిజికల్ డైరెక్టర్ అభినందించారు.