మొబైల్ వాలెట్ యాప్ ఫోన్పే 350 మిలియన్ డాలర్ల ఫండింగ్ సమకూర్చుకుంది. ప్రైవేట్ ఈక్విటీ కంపెనీ జనరల్ అట్లాంటిక్ నుంచి ఈ ఫండ్ సమీకరించింది. ఈ నిధులతో కలుపుకొని కంపెనీ వాల్యుయేషన్ 12 బిలియన్ డాలర్లకు చేరిందని ఫోన్పే ప్రకటించింది. బిలియన్ డాలర్ల ఫండ్స్ సేకరించాలనే టార్గెట్ లో ఫస్ట్ ఫేజ్ పూర్తయిందని, కంపెనీలో ఇన్వెస్ట్ చేసేందుకు గ్లోబల్, ఇండియన్ ఇన్వెస్టర్లు ఆసక్తి చూపిస్తున్నారని చెప్పింది. ఫ్లిప్ కార్ట్ నుంచి వేరు పడ్డ తర్వాత ఫోన్పే నిధులు సేకరించడం ఇదే మొదటిసారి. 2018లో వాల్ మార్ట్ ఫోన్ పే లో వాటా తీసుకుంది.
ఫండింగ్ ద్వారా వచ్చిన డబ్బును డేటా సెంటర్లు తదితర ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇప్రూవ్ మెంట్ కోసం ఉపయోగించనున్నట్లు ఫోన్ పే ప్రకటించింది. దీంతో పాటు ఫైనాన్షియల్ సర్వీసెస్ ఆఫరింగ్ ను భారీగా పెంచాలని టార్గెట్ పెట్టుకుంది. ఇన్సూరెన్స్, లెండింగ్, వెల్త్ మేనేజ్మెంట్ తదిత కొత్త బిజినెస్ లలోనూ ఇన్వెస్ట్ చేసేందుకు ఫోన్ పే ప్లాన్ చేస్తోంది. యూపీఐ లైట్, క్రెడిట్ ఆన్ యూపీఐ వంటి వాటిపై ఫోకస్ పెట్టడం కోసం ఈ నిధుల సమీకరణ సాయపడుతుందని తెలిపింది. 2015లో ప్రారంభమైన ఫోన్ పేకు 40 కోట్ల మంది రిజిస్టర్డ్ యూజర్లు, 3.5 కోట్ల మంది మర్చంట్లు ఉన్నారు.
