నవంబర్‌‌‌‌లో ఫోన్‌‌పే ట్రాన్సాక్షన్లు సూపర్

నవంబర్‌‌‌‌లో ఫోన్‌‌పే ట్రాన్సాక్షన్లు సూపర్

న్యూఢిల్లీ: కిందటేడాదితో పోలిస్తే తమ ప్లాట్‌‌ఫామ్‌‌లో  ఆఫ్ లైన్ మర్చంట్ ట్రాన్సాక్షన్లు (స్కాన్ అండ్ పే)   నవంబర్‌‌‌‌లో 200 శాతం పెరిగాయని  ఫోన్‌‌పే ప్రకటించింది. దాదాపు 100  కోట్ల ట్రాన్సాక్షన్లను   (పీర్ టూ మర్చంట్స్‌‌)  ప్రాసెస్ చేశామని తెలిపింది. ఇప్పటికే 2.5 కోట్ల చిన్న వ్యాపారస్తులను డిజిటల్ పేమెంట్స్‌‌ వైపు తీసుకొచ్చామని పేర్కొంది.  డిజిటల్ పేమెంట్స్ విస్తరిస్తుండడంతో పాటు, ఫీల్డ్​లో పనిచేస్తున్న 1.25 లక్షల మంది శ్రమ వలన  ఈ గ్రోత్‌‌ను సాధించగలిగామని ఫోన్‌‌పే ప్రకటించింది. ‘ఫోన్‌‌పేకు ప్రస్తుతం 15,700 మంది మర్చంట్ల నెట్‌‌వర్క్‌‌ ఉంది. దేశంలోని 99 శాతం పిన్‌‌కోడ్‌‌లలోని గ్రామాలు, టౌన్‌‌లు, సిటీలలో  వీరు ఉన్నారు’ అని ప్రకటించింది.