ఆర్సీబీ అభిమానులకు ఊరట.. జట్టులోకి విధ్వంసకర ఓపెనర్

ఐపీఎల్ 2025 మెగా వేలంలో ఆర్సీబీ అభిమానులకు కాస్త ఊరట లభించే వార్త. మెగా ఆక్షన్ మొదలైనప్పటీ నుండి కీలక ఆటగాళ్లు అమ్మడుపోతున్న ఆర్సీబీ మాత్రం ఎవరిని కొనుగోలు చేయకుండా సైలెంట్‎గానే ఉంది. పంత్, అయ్యర్, రాహుల్ కోసం వేలంలో బిడ్ వేసిన పక్క ఫ్రాంచైజ్‎ల నుండి తీవ్రమైన పోటీ ఉండటంతో రేస్ నుండి వెనక్కి తగ్గింది. ఓ పక్కా కీలక ఆటగాళ్లు వేలంలో అమ్ముడుపోతున్న.. ఆర్సీబీ మాత్రం ఎవరినీ కొనుగోలు చేయకపోవడంతో అభిమానుల్లో ఆగ్రహం, అసహనం నెలకొన్నాయి. 

ఈ తరుణంలో ఎట్టకేలకు వేలంలో ఆర్సీబీ ఓ స్టార్ ఆటగాడిని కొనుగోలు చేసింది. ఇంగ్లాండ్ డేరింగ్ అండ్ డాషింగ్ ఓపెనర్ ఫిల్ సాల్ట్‌ను రూ.11.5 కోట్లకు ఆర్సీబీ దక్కించుకుంది. ఫిల్ సాల్ట్ కోసం ముంబై, ఆర్సీబీ, కేకేఆర్ హోరాహోరీగా తలపడ్డాయి. ముంబై, కేకేఆర్ రేస్ నుండి వెనక్కి తగ్గడంతో చివరకు ఆర్సీబీ సాల్ట్‎ను కొనుగోలు చేసింది. లాస్ట్ సీజన్‎లో ఫిల్ సాల్ట్ కేకేఆర్ తరుఫున బరిలోకి దిగి ఆ జట్టు టైటిల్ గెలవడంలో కీలక పాత్ర పోషించాడు. 

అయినప్పటికీ కేకేఆర్ ఫిల్ సాల్ట్‎ను రిటైన్ చేసుకోకుండా వేలంలోకి వదిలేసింది. ఆక్షన్‎లోకి వచ్చిన ఫిల్ సాల్ట్‎ను ఆర్సీబీ దక్కించుకుంది. ఫిల్ సాల్ట్ ను కొనుగోలు చేయడంతో ఆర్సీబీ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు మెగా వేలంలో ఆర్సీబీ ఇప్పటి వరకు ముగ్గురు ఆటగాళ్లను కొనుగోలు చేసింది. లివింగ్ స్టోన్ రూ.8.75, జితేశ్ శర్మ రూ.11 కోట్లు, ఫిల్ సాల్ట్ రూ.11.50  కోట్లకు దక్కించుకుంది. విరాట్ కోహ్లీ, రజత్ పాటిదార్, యశ్ దయాల్‎ను వచ్చే సీజన్ కోసం ఆర్సీబీ రిటైన్ చేసుకున్న సంగతి తెలిసిందే.