ఆల్‌‌ టైమ్ హైకి దగ్గర్లో పెట్రోల్ ధరలు.. లీటర్​ @ 87.34

ఆల్‌‌ టైమ్ హైకి దగ్గర్లో పెట్రోల్ ధరలు.. లీటర్​ @ 87.34
నెల తర్వాత పెరిగిన ధర న్యూఢిల్లీ: పెట్రోల్ ధరలు ఆల్‌‌ టైమ్ హై దగ్గర్లోకి చేరుకున్నాయి. నెల విరామం తర్వాత మళ్లీ ఫ్యూయల్ రేట్లను పెంచడం ప్రారంభించాయి ప్రభుత్వ రంగ ఆయిల్ కంపెనీలు. లీటరు పెట్రోల్‌‌పై 26 పైసలు, లీటరు డీజిల్‌‌పై 25 పైసలు ధర పెంచుతున్నట్టు ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు పేర్కొన్నాయి. ఈ పెంపుతో దేశ రాజధానిలో లీటరు పెట్రోల్ రూ.83.97కు, లీటరు డీజిల్ రూ.74.12కు చేరుకున్నాయి. ముంబైలో డీజిల్ ధర ఆల్ టైమ్ హై రూ.80.78ను తాకింది. 2018 అక్టోబర్ 4తో పోలిస్తే ఇది అత్యధికం. లీటరు పెట్రోల్ ధర రూ.90.60కు చేరింది. హైదరాబాద్‌‌లో లీటరు డీజిల్ ధర రూ.80.88గా రికార్డయింది. అలాగే లీటరు పెట్రోల్ ధర రూ.87.34 వద్ద పలికింది. ప్రభుత్వ ఆఫీసుల తీరు మారాలి సోషల్ మీడియాలో ఆడవాళ్లపై పెరిగిన వేధింపులు రూ.50 లక్షల లోపు ఇండ్లకు ఫుల్ డిమాండ్