జాతీయ వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ రైతులు చేపట్టిన నిరసనలకు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మద్దతు ప్రకటించారు. రైతు చట్టాలు వద్దంటూ దేశవ్యాప్తంగా 2 కోట్ల మంది సంతకాలు చేయగా, ఆ వినతి పత్రాన్ని రాహుల్ గాంధీ రేపు(గురువారం) రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ కు సమర్పించనున్నారు. అంతేకాదు.. ఢిల్లీలోని విజయ్ చౌక్ నుంచి రాష్ట్రపతి భవన్ వరకు రాహుల్ గాంధీ కాలినడకన వెళ్లాలని నిర్ణయించుకున్నారు.
