ఇంటర్నేషనల్‌‌ క్రికెట్‌‌కు సిడెల్‌‌ గుడ్‌‌బై

ఇంటర్నేషనల్‌‌  క్రికెట్‌‌కు సిడెల్‌‌ గుడ్‌‌బై

మెల్‌‌బోర్న్‌‌: ఆస్ట్రేలియా సీనియర్‌‌ పేసర్‌‌ పీటర్‌‌ సిడెల్‌‌ ఇంటర్నేషనల్‌‌ క్రికెట్‌‌కు ఆదివారం రిటైర్మెంట్‌‌ ప్రకటించాడు. డొమెస్టిక్‌‌ క్రికెట్‌‌లో మాత్రం కొనసాగనున్నాడు. 2008లో మొహాలీలో ఇండియాతో జరిగిన టెస్ట్‌‌తో ఇంటర్నేషనల్‌‌ క్రికెట్‌‌లో అడుగుపెట్టిన 35 ఏళ్ల సిడెల్‌‌ న్యూజిలాండ్‌‌తో ఆదివారం ముగిసిన బాక్సింగ్‌‌ డే టెస్ట్‌‌కు ఎంపికైనా తుది జట్టులో చోటు దక్కించుకోలేకపోయాడు. 67 టెస్ట్‌‌ల్లో ఆసీస్‌‌కు ప్రాతినిధ్యం వహించిన సిడెల్‌‌ 221 వికెట్లు తీశాడు. అంతేకాక 20 వన్డేల్లో  17, రెండు టీ20ల్లో మూడు వికెట్లు పడగొట్టాడు.