ఇండిగో కొత్త సీఈవోగా పీటర్ ఎల్బర్స్ బాధ్యతలు చేపట్టనున్నారు. 2019 నుంచి ఇండిగో ఎయిర్ లైన్ సీఈవో విధులు నిర్వహిస్తున్న రోనోజోయ్ దత్ రిటైర్ అవుతున్నట్లు ఇండిగో సంస్థ అధికారికంగా ప్రకటించింది. 2019, జనవరి నెలలో ఇండిగో సీఈవో రోనోజోయ్ దత్ బాధ్యతలు చేపట్టారు. సుదీర్ఘ కాలంగా సీఈవోగా సంస్థను ముందుండి నడిపిస్తున్న రోనోజోయ్ దత్ ఈ ఏడాది సెప్టెంబర్ 30న రిటైర్ అవుతున్నట్లు ఇండిగో తెలిపింది. రిటైర్ అవుతున్న రోనోజోయ్ దత్ స్థానంలో కేఎల్ఎం రాయిల్ డచ్ ఎయిర్‌లైన్ సీఈవోగా ఉన్న పీటర్ ఎల్బర్స్.. ఈ ఏడాది అక్టోబర్ 1లోపు బాధ్యతలు స్వీకరిస్తున్నట్లు ఇండిగో సంస్థ ప్రతినిధులు తెలిపారు.
ఇండిగో తనని సీఈవో నియమించడం పట్ల ఎల్బర్స్ సంతోషం వ్యక్తం చేశారు. ఇండిగో విజన్‌ను నెరవేరుస్తూ, భారత్‌తో పాటు అంతర్జాతీయ స్థాయిలో ప్రయాణికులకు ఇండిగో సేవల్ని అందుబాటులోకి తెస్తామని చెప్పారు.
IndiGo appoints Pieter Elbers Chief Executive Officer, Rono Dutta to retire
— ANI Digital (@ani_digital) May 18, 2022
Read @ANI Story | https://t.co/5hqDP0P9bA#indigo #Indigoairlines #PieterElbers pic.twitter.com/WUIM0jxxNd
మరిన్ని వార్తల కోసం..
