BGT 2024-25: తొలి టెస్టుకు భయంకరమైన బౌన్సీ పిచ్.. భారత్‌కు ఆస్ట్రేలియా పిచ్ క్యూరేటర్ వార్నింగ్

టీమిండియాతో నవంబర్ 22 నుంచి జరగనున్న బోర్డర్‌-గావస్కర్ ట్రోఫీని ఆస్ట్రేలియా సీరియస్ గా తీసుకున్నట్టు కనిపిస్తుంది. ఆస్ట్రేలియా గడ్డపై చివరగా జరిగిన రెండు టెస్టుల సిరీస్‌ను భారత జట్టు గెలుచుకోవడం ఒక కారణమైతే.. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ చేరాలంటే ఈ సిరీస్ ఖచ్చితంగా గెలిచి తీరాల్సిన పరిస్థితి. దీంతో తొలి టెస్ట్ నుంచే భారత్ ను ఓడించే ప్రణాళికలు మొదలు పెట్టింది. శుక్రవారం (నవంబర్ 22) నుంచి పెర్త్ వేదికగా ప్రారంభమయ్యే తొలి టెస్టుకు అప్పుడే పిచ్ సిద్ధం చేసింది. 

సాధారణంగా పెర్త్ లోని పిచ్ ఫాస్ట్ బౌలర్లకు అనుకూలిస్తాయి. దీనికి తోడు పెర్త్ పిచ్ మరింత బౌన్స్ ఉండేలా తయారు చేశాడంట. ఈ విషయాన్నీ స్వయంగా పెర్త్ పిచ్ క్యూరేటర్ స్వయంగా చెప్పుకొచ్చాడు. వెస్ట్రన్ ఆస్ట్రేలియా క్రికెట్ హెడ్ క్యూరేటర్ ఐజాక్ మెక్‌డొనాల్డ్ 'ఈఎస్‌పిఎన్‌క్రిక్‌ఇన్‌ఫో'తో మాట్లాడుతూ ఇలా చెప్పుకొచ్చాడు. " ఇది ఆస్ట్రేలియా. ఇది పెర్త్. ఇక్కడ పిచ్ ను మంచి పేస్, బౌన్స్ ఉండేలా తయారు చేశాను". అని భారత్ కు పరోక్షంగా వార్నింగ్ ఇచ్చాడు. మెక్‌డొనాల్డ్ పిచ్‌ను కాస్త స్పైసీగా మార్చేందుకు కొంత పచ్చికను వదిలివేయాలని చూస్తున్నట్లు చెప్పాడు.

ALSO READ | భారత్‌తో టెస్ట్ సిరీసే ఆస్ట్రేలియాకు ముఖ్యం.. మమ్మల్ని పట్టించుకోలేదు: పాకిస్థాన్ హెడ్ కోచ్

మెక్‌డొనాల్డ్ గత ఏడాది డిసెంబర్‌లో పాకిస్థాన్‌తో జరిగిన తొలి టెస్టుకు భయంకరమైన బౌన్సీ పిచ్ ను తాయారు చేశాడు. అలాంటి పిచ్ ను మరోసారి సిద్ధం చేసేందుకు ప్రయత్నిస్తున్నాడట. ఆ మ్యాచ్ లో ఆసీస్ 360 పరుగుల భారీ విజయాన్ని సాధించగా.. పాకిస్థాన్ రెండో ఇన్నింగ్స్‌లో 89 పరుగులకే ఆలౌటైంది. పిచ్ పై పగుళ్లు ఏర్పడడంతో ఆస్ట్రేలియా ఆటగాళ్లకు కూడా దెబ్బలు తగిలాయి.  ఇటీవల ఇక్కడ జరిగిన మూడో వన్డేలో పాకిస్తాన్ పేసర్లు షాహీన్ షా ఆఫ్రిది, నసీమ్ షా, హరీస్ రవూఫ్ ఆస్ట్రేలియా లైనప్‌ను చిత్తు చేసి 140 పరుగులకు ఆలౌట్ చేశారు.