కార్పొరేషన్​ ట్యాక్స్​ కంటే పర్సనల్​ ఐటీ వసూళ్లే ఎక్కువ

కార్పొరేషన్​ ట్యాక్స్​ కంటే పర్సనల్​ ఐటీ  వసూళ్లే ఎక్కువ

న్యూఢిల్లీ: రూల్స్​ను కఠినం చేయడం, పన్ను ఎగవేతలను ఆపడంతో పర్సనల్​ఇన్​కమ్​ట్యాక్స్​ వసూళ్లు భారీగా పెరుగుతున్నాయి. ఈసారి కార్పొరేషన్​ ట్యాక్స్​ కంటే పర్సనల్ ఐటీ వసూళ్లు ఎక్కువగా ఉన్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో డైరెక్ట్​ ట్యాక్స్​ కలెక్షన్లకు సంబంధించి మూడింట ఒకవంతు మొత్తం ఇది వరకే వసూలయింది. డైరెక్ట్​ ట్యాక్సుల్లో కార్పొరేషన్​​ ట్యాక్స్​, పర్సనల్​ఐటీ.. రెండు కలిసే ఉంటాయి. తాజా ఆర్థిక సంవత్సరం మొదటి నాలుగు నెలల్లో వీటి విలువ 40 శాతం పెరిగి రూ.ఐదు లక్షల కోట్లకు చేరింది. ఈసారి మొత్తం రూ.14.2 లక్షల కోట్లను వసూలు చేయాలని టార్గెట్​గా పెట్టుకున్నారు. పోయిన ఆర్థిక సంవత్సరం కంటే ఇది 35 శాతం ఎక్కువ.

ప్రపంచ మార్కెట్లలో ఇబ్బందులు, మానిటరీ పాలసీ కఠినంగా ఉన్న  నేపథ్యంలో పన్నుల ఆదాయం ఎక్కువ ఉంటే ప్రభుత్వం మరింత ఎక్కువ డబ్బు ఖర్చు చేయడానికి అవకాశాలు ఉంటాయి. ఇదిలా ఉంటే, డైరెక్ట్​ ట్యాక్స్​ రీఫండ్లు కూడా 38 శాతం పెరిగి రూ.67 వేల కోట్లకు చేరుకున్నాయి. పోయిన ఏడాది కూడా కార్పొరేషన్​ ట్యాక్స్​ కంటే పర్సనల్​ ఐటీ వసూళ్లు ఎక్కువ ఉన్నాయి. మొత్తం రూ.2.67 లక్షల కోట్లు వసూలయ్యాయి. అంతకుముందు ఆర్థిక సంవత్సరం కంటే రూ.50 వేల కోట్లు ఎక్కువగా వచ్చాయి.  

వ్యక్తిగత ఆదాయపు పన్నులో భాగమైన సెల్ఫ్​ అసెస్​మెంట్​ ట్యాక్స్‌ వసూళ్లు ఈ ఏడాది జులై వరకు 275 శాతం పెరిగి రూ.43,500 కోట్లకు చేరుకున్నాయి. 2023 ఆర్థిక సంవత్సరం బడ్జెట్ లక్ష్యం రూ.ఏడు రూ.లక్ష కోట్లలో వ్యక్తిగత ఆదాయపు పన్ను వాటా 38శాతానికి చేరుకుంది. కార్పొరేట్​ పన్ను వసూళ్లు 32శాతం పెరిగి రూ.2.22 లక్షల కోట్లకు చేరాయి. ఇవి 2023 ఆర్థిక సంవత్సరం బడ్జెట్ టార్గెట్​ రూ.7.2 లక్షల కోట్లలో 31శాతం వరకు ఉన్నాయి.