గంజాయి తరలిస్తున్న వ్యక్తి అరెస్ట్..

రంగారెడ్డి జిల్లాలో అక్రమంగా నిషేధి గంజాయిని తరలిస్తున్న ఓ వ్యక్తిని రాజేంద్రనగర్‌ పోలీసులు అరెస్ట్ చేశారు. మరో ఇద్దరు నిందితులు పరారీ ఉన్నారు. నిందితుల దగ్గరి నుంచి 61 ప్యాకెట్లు గంజాయి, మూడు సెల్‌ఫోన్‌లు, ఒక టాటా ఇండిగో కారును స్వాధీనం చేసుకున్నారు.  ఓడిషా రాష్ట్రానికి చెందిన సోమేష్,  జహీరాబాద్‌కు చెందిన శివాజీలు డ్రగ్స్‌(గంజాయి) వ్యాపారం చేస్తూ.. ఒడిసా రాష్ట్రం నుంంచి జహీరాబాద్‌కు సరఫరా చేస్తుంటారు. 

గంజాయి తాగే అలవాటు ఉన్న నిరుపేదలకు వీటిని విక్రయించి లాభాన్ని పొందుతున్నారని పోలీసులు తెలిపారు. ఈ నేపథ్యంలో భద్రాద్రి కొత్తగూడంలో ఉండే  వెంకన్నకు ఆఫర్‌ గంజాయిని తీసుకోని జహీరాబాద్‌లోని శివాజీకి అందజేస్తే.. 10 వేల రూపాయలు ఇస్తామని ఆశచూపారు. ఇది నమ్మిన వెంకన్న ఒప్పందం చేసుకున్నాడని తెలిపారు. యెల్లందు గ్రామంలో వెంకన్న టాటా ఇండిగో కారు ఏపి31బిఎఫ్‌8521లోని డిక్కిలో గంజాయిని భద్రపరిచారని పేర్కొన్నారు. నిన్న(మార్చి 1) మధ్యాహ్నం 3.30 గంటలకు జహీరాబాద్‌లో గంజాయిని అప్పగించేందుకు బయలుదేరారన్న  పక్కా సమాచారం అందుకున్న రాజేంద్రనగర్‌ SOT పోలీసులు హిమాయత్ సాగర్  సమీపంలోని ORR సర్వీస్‌ రోడ్డులో నిందితులను పట్టుకున్నారు.