దేశంలో కరోనా వ్యాప్తి కేసుల సంఖ్య పెరుగుతోంది. 20 వేల వరకు రోజువారీ కేసులు నమోదవుతుండడం ఆందోళన కలిగిస్తోంది. ఈ క్రమంలో డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA ) నిబంధనలు మరింత కఠినతరం చేసింది. మాస్కు లేకుండా వచ్చే ప్రయాణికులను విమానం నుంచి దించేయాలని అన్ని విమానయాన సంస్థలను ఆదేశించింది. దీనికి సంబంధించి నూతన మార్గదర్శకాలు విడుదల చేసింది.
మాస్కు లేనివారిని ఎయిర్ పోర్టులోకి అనుమతించవద్దని సీఐఎస్ఎఫ్, పోలీసులకు తెలిపింది. ఎయిర్ పోర్టులోకి ప్రయాణికులు మాస్కులు ధరించేలా చూడాల్సిన బాధ్యత విమానాశ్రయ డైరెక్టర్, టెర్మినల్ మేనేజర్ లదేనని స్పష్టం చేసింది. ప్రయాణికులు కరోనా ప్రోటోకాల్ బ్రేక్ చేస్తే వారిని భద్రతాసిబ్బందికి అప్పగించాలని DGCA నూతన మార్గదర్శకాల లిస్టులో తెలిపింది.
విమానంలో ప్రయాణించేటప్పుడు తప్పనిసరిగా మాస్కు ఉండాల్సిందేనని, అది కూడా ముక్కును కవర్ చేసేలా మాస్కు ఉండాలని స్పష్టం చేసింది.
