చెమటతో పర్ఫ్యూమ్‌.. బ్రెజీలియన్ మోడల్ వెరైటీ ఆలోచన

చెమటతో పర్ఫ్యూమ్‌..  బ్రెజీలియన్ మోడల్ వెరైటీ ఆలోచన

మీరు తరచుగా అనేక డియోడరెంట్‌ల ప్రకటనలను చూసి ఉంటారు. అందులోనూ ముఖ్యంగా అబ్బాయిలు వాటిని ఉపయోగిస్తే, అమ్మాయిలు ఆకర్షించబడతారు అని..  డియోడరెంట్లు, పర్ఫ్యూమ్‌లను విక్రయించడానికి కంపెనీలు ఈ కాన్సెప్ట్‌ను ఎంచుకుంటూ ఉండడం చూస్తూనే ఉంటాం. ఇదే తరహా కాన్సెప్ట్ తో ఓ బ్రెజిలియన్ మోడల్ కొత్త స్వెట్ పర్ఫ్యూమ్  బ్రాండ్‌ను ఇటీవల విడుదల చేసింది. దాని వాసనతో అవతలి వాళ్లు ఇట్టే పడిపోతారన్న కాన్సెప్ట్ తో వచ్చిన ఈ పర్ఫ్యూమ్ కు డిమాండ్ అమాంతం పెరిగిపోయింది. అయితే ఈ పర్ఫ్యూమ్‌లోని విచిత్రం ఏమిటంటే, ఇందులో ఆ మోడల్ చెమట కూడా ఉండడమే.

అవును, మీరు చదివింది నిజమే! బ్రెజీలియన్ కు ఓ మోడల్ తన చెమటతో చేసిన పెర్ఫ్యూమ్‌ను మార్కెట్‌లోకి విడుదల చేసింది. సావో పాలోలో నివసించే 29 ఏళ్ల మోడల్ వెనెస్సా మౌరా పర్ఫ్యూమ్ బ్రాండ్‌ను ప్రారంభించింది. ఆమె మోడల్‌గానే కాకుండా ఆన్‌లైన్‌లో ఇన్‌ఫ్లుయెన్సర్ కూడా. ఈ నేపథ్యంలో తన చెమటతో పర్ఫ్యూమ్ ను తయారు చేయాలన్న ఆలోచన వచ్చింది. ఇంతకీ ఆమెకి ఇంత వింత ఆలోచన ఎలా వచ్చింది అన్న విషయానికొస్తే..

పర్ఫ్యూమ్‌లో చెమట.. 

చాలా మంది తమ బాయ్‌ఫ్రెండ్‌లు, మాజీ బాయ్‌ఫ్రెండ్‌లు చెప్పిన దాని ప్రకారం.. ఆమె శరీరంన నుంచి వచ్చే సహజ వాసన సుగంధంగా ఉంటుంది. ఇదే ఆమెను తమపైపు వచ్చేలా ఆకర్షిస్తుంది అని. అయితే ఈ విషయాన్ని ఆమె చాలా సీరియస్‌గా తీసుకుంది, అలా వచ్చిన ఆలోచనతోనే ఆమె తన చెమట నుండి పర్ఫ్యూమ్ తయారు చేసింది. 'ఫ్రెష్ గాడెస్ పెర్ఫ్యూమ్' అనే పేరుతో ఉన్న ఈ పెర్ఫ్యూమ్‌లో చెమటతో పాటు అనేక ఇతర పదార్థాలు కూడా ఉన్నాయి. ప్రతి సీసాలో 8 ml వరకు చెమట ఉంటుందని ఆమె తెలిపింది. చాలా మంది ఆన్‌లైన్ ఫాలోవర్లు తన పెర్ఫ్యూమ్ కారణంగా తన భాగస్వామిని బాగా ఆకర్షించారని ఆమె పేర్కొంది. పెర్ఫ్యూమ్ కారణంగా, ఆమె క్రష్ ఆమెను రెండవసారి డేట్ కోసం పిలిచిందని కూడా ఒకరు చెప్పారు.

పర్ఫ్యూమ్ ధర..

ఈ పెర్ఫ్యూమ్ ధర విషయానికొస్తే.. చెమటతో కూడిన పెర్ఫ్యూమ్ కొనాలనుకునే వారు తమ జేబులు ఖాళీ చేయాల్సిందే. ఎందుకంటే దాని ధర చాలా ఎక్కువ. 50 ml యొక్క ఒక సీసా ధర 138 డాలర్లు అంటే రూ.11 వేల కంటే ఎక్కువ.