మొబైల్‌‌‌‌ ఫోన్‌‌‌‌ ఎక్కువ వాడేవాళ్లు ఎక్సర్‌‌‌‌‌‌‌‌సైజ్‌‌‌‌లు చేయాలి

మొబైల్‌‌‌‌ ఫోన్‌‌‌‌ ఎక్కువ వాడేవాళ్లు ఎక్సర్‌‌‌‌‌‌‌‌సైజ్‌‌‌‌లు చేయాలి

కంప్యూటర్‌‌‌‌‌‌‌‌ వర్క్‌‌‌‌ చేసేవాళ్లు, మొబైల్‌‌‌‌ ఫోన్‌‌‌‌ ఎక్కువ వాడేవాళ్లు మెడలు, భుజాలు వంచి ఎక్కువసేపు కూర్చుంటారు. అలాంటివాళ్లకు మెడలు, భుజాలు వంగిపోయినట్టు అవుతాయి. ఈ సమస్య నుంచి బయటపడాలంటే కొన్ని ఎక్సర్‌‌‌‌‌‌‌‌సైజ్‌‌‌‌లు చేయాలని  చెప్తున్నాడు ఫిట్‌‌‌‌నెస్‌‌‌‌ ఎక్స్‌‌‌‌పర్ట్‌‌‌‌ రాబిన్‌‌‌‌ బెల్‌‌‌‌. దీనివల్ల ఛాతి, చేతులు, భుజాలు, వెన్నెముక బలపడతాయి. పొడవుగా కనిపిస్తారని చెప్తున్నాడు.

డంబెల్‌‌‌‌ ఎక్స్‌‌‌‌టర్నల్‌‌‌‌ రొటేషన్‌‌‌‌: ఈ ఎక్సర్‌‌‌‌‌‌‌‌సైజ్‌‌‌‌ ఎలా చేయాలంటే... తక్కువ బరువు ఉండే డంబెల్స్‌‌‌‌ తీసుకొని, నిటారుగా నిల్చోవాలి. చేతుల్ని 90 డిగ్రీల్లో పక్కకు చాపాలి. తరువాత మోచేతులు పైకి మడిచి, ముందుకు, వెనక్కి అనాలి.

ప్యార్లల్‌‌‌‌ బార్‌‌‌‌‌‌‌‌ డిప్స్‌‌‌‌: పార్క్‌‌‌‌లో ఉండే కుర్చీలతో లేదా ప్యార్లల్‌‌‌‌ బార్‌‌‌‌‌‌‌‌ రాడ్స్‌‌‌‌ సాయంతో ఈ ఎక్సర్‌‌‌‌‌‌‌‌సైజ్‌‌‌‌ చేయాలి. ఈ రాడ్స్‌‌‌‌ మధ్యలో కూర్చొని, కాళ్లు ముందుకు చాపి, రెండు చేతులతో శరీరాన్ని పైకి ఎత్తుతూ పుష్‌‌‌‌ అప్స్‌‌‌‌ చేయాలి. ఈ ఎక్సర్‌‌‌‌‌‌‌‌సైజ్‌‌‌‌ చేయడం వల్ల భుజాలు, వెన్నెముక బలంగా తయారవుతాయి. 

ఒలంపిక్‌‌‌‌ రింగ్‌‌‌‌ పుల్‌‌‌‌ అప్స్‌‌‌‌: జిమ్నాస్కిక్‌‌‌‌ రింగ్స్‌‌‌‌ మార్కెట్‌‌‌‌లో దొరుకుతాయి. వాటి సాయంతో ఈ ఎక్సర్‌‌‌‌‌‌‌‌సైజ్ చేయొచ్చు. ఈ రింగ్స్‌‌‌‌ కింద నిల్చొని, రెండు  చేతులతో రింగ్స్ పట్టుకొని శరీరాన్ని పైకి ఎత్తుతూ ఎక్సర్‌‌‌‌‌‌‌‌సైజ్‌‌‌‌ చేయాలి. ఎక్సర్‌‌‌‌‌‌‌‌సైజ్‌‌‌‌ చేస్తున్నపుడు తల పైకి చూడాలి. ఛాతి, భుజాలు నిటారుగా ఉంచాలి.

నోట్‌‌‌‌: ఇలాంటి ఎక్సర్‌‌‌‌‌‌‌‌సైజ్‌‌‌‌లు ఇంట్లో చేయాలనుకుంటే, ముందు కొన్ని రోజులు ఎక్స్‌‌‌‌పర్ట్‌‌‌‌ దగ్గర ట్రైనింగ్‌‌‌‌ తీసుకోవాలి. దానిమీద పూర్తి అవగాహన వచ్చాకే ఇంట్లో ప్రాక్టీస్ మొదలుపెట్టాలి.