కోవిడ్ 19 మ్యుటేషన్ చెంది ...సబ్ వేరియంట్ జేఎన్ 1 ప్రస్తుతం జనాలను భయాందోళనకు గురి చేస్తోంది. ప్రపంచవ్యాప్తంగా రోజురోజుకీ యాక్టివ్ కేసులు పెరుగుతున్నాయి. జేఎన్1 వేరియంట్ కొత్తేడాది భయానక వాతావరణాన్ని సృష్టిస్తోంది. భారత దేశంలో కేరళలో వెలుగులోకి వచ్చిన ఈ కొత్త వేరియంట్ ప్రస్తుతం దేశవ్యాప్తంగా విస్తరిస్తోంది. ఇప్పటికే దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 4 వేలకి చేరుకోవడం ఆందోళన కలిగిస్తోంది. ఈ నేపథ్యంలో ఈ కొత్త వేరియంట్ బారిన పడకుండా ఉండాలంటే, రోగనిరోధక శక్తిని పెంచుకోవాలని నిపుణులు చెబుతున్నారు. మరి రోగ నిరోధక శక్తిని సహజంగా ఎలా పెంచుకోవాలి ఇప్పుడు తెలుసుకుందాం
-
మనం తీసుకునే ఆహారం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా రోగ నిరోధక శక్తిని పెంచుకోవడంలో కొన్ని రకాల ఆహార పదార్థాలు ఉపయోగపడతాయి. బీటా కెరోటిన్, విటమిన్ సి ఎక్కువగా లభించే ఆహార పదార్థాలను తీసుకోవాలి.
-
నారింజ, నిమ్మ జాతికి చెందిన పండ్లను తీసుకుంటే రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.
-
క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. రోజులో కనీసం గంటసేపు ఏదైనా వ్యాయామం చేయాలని నిపుణులు చెబుతున్నారు. ఒకవేళ వ్యాయామం చేయకపోయినా వీలైనంత ఎక్కువగా నడవడానికి ప్రయత్నించాలని నిపుణులు చెబుతున్నారు. మొత్తం మీద శారీరక శ్రమను పెంచాలని చెబుతున్నారు.
-
బయటకు వెళ్లేటప్పుడు తప్పనిసరిగా మాస్కులు ధరించండి. ఈ మాస్కలు ముక్కు, నోరు మూసే విధంగా పెట్టుకోవాలి. తరచుగా శానిటైజర్‌ను వాడండి. సాధ్యమైనంత వరకు భౌతిక దూరం పాటించండి. కరచాలనం ( షేక్ హ్యాండ్స్) లాంటివి ఇవ్వకుండా ఉండాలి. విష్ చేయాలంటే షేక్ హ్యాండ్ కు బదులుగా నమస్కారం పెట్టడం అలవాటు చేసుకోండి.
-
వైరస్ దరిచేరకుండా ఉండాలన్నా, రోగనిరోధక శక్తి పెరగాలన్నా శరీరం హైడ్రేట్‌గా ఉండాలని నిపుణులు చెబుతున్నారు. శరీరానికి తగినంత నీటిని తీసుకోవాలని సూచిస్తున్నారు. శరీరం నిత్యం హైడ్రేట్‌గా ఉంటే శరీరం నుంచి ప్రమాదకరమైన టాక్సిన్స్‌ను తొలగించడంలో ఉపయోగపడుతుంది. ప్రతీ రోజూ కనీసం 7 నుంచి 8 గ్లాసుల నీరు తాగాలని చెబుతున్నారు.
-
రోగ నిరోధక శక్తి పెరగడంలో నిద్ర కీలక పాత్ర పోషిస్తుందని నిపుణులు చెబుతుంటారు. సరిపడ నిద్ర ఉంటేనే ఆరోగ్యంగా ఉంటారు. ఆరోగ్యకరమైన పెద్దలు రోజులో కనీసం 7 నుంచి 8 గంటలు నిద్రపోవాలని అంటున్నారు. నిద్రలేమితో ఇబ్బందిపడే వారి రోగనిరోధక వ్యవస్థపై ప్రతికూల ప్రభావం పడుతుందని నిపుణులు చెబుతున్నారు.
-
ఇక మానసిక ఆరోగ్యాన్నికూడా కాపాడుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఒత్తిడిని దూరం చేసుకునేందుకు మెడిటేషన్, యోగా వంటి వాటిని అలవాటు చేసుకోవాలని చెబుతున్నారు. మానసిక ఆరోగ్యం బాగుంటే రోగ నిరోధక శక్తి పెరుగుతుందని పేర్కొంటున్నారు