దీదీ.. నిన్ను ఓడించడానికి ప్రజలు రెడీ

దీదీ.. నిన్ను ఓడించడానికి ప్రజలు రెడీ

కోల్‌‌కతా: బెంగాల్ ఎన్నికల్లో తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీకి ఓటమి తప్పదని ఆ రాష్ట్ర బీజేపీ చీఫ్ దిలీప్ ఘోష్ అన్నారు. దీదీ ఓటమికి రెడీగా ఉండాలని హెచ్చరించారు. ‘ఎన్నికలకు సంబంధించి తొలి రెండు ఫేజ్‌ల అభ్యర్థులను ఎన్నుకున్నాం. తర్వాతి మూడు ఫేజ్‌‌లకు సంబంధించిన క్యాండిడేట్ల ఎంపిక గురించి చర్చిస్తున్నాం. దీదీని ఓడించడానికి ప్రజలు రెడీగా ఉన్నారు’ అని ఘోష్ చెప్పారు. బెంగాల్‌లో ఈ నెల 27 నుంచి 29 వరకు ఎన్నికలు జరగనున్నాయి. ఫలితాలు మే 2న వెలువడనున్నాయి.