నేను ఇంత గడ్డి తిన్నానని సంతకం పెడతావా లేదా..? అంటూ ప్రభుత్వ ఉద్యోగిపై గ్రామస్థులు తిరగబడ్డారు. కొంతమంది ప్రభుత్వ ఉద్యోగుల అవినీతిపై సామాన్యులు తిరగబడతున్నా మార్పురావడం లేదు.
కడప జిల్లా రాయచోటి గోపవరం మండలం ఎస్. రామాపురం పంచాయితీ సెక్రటరీ వెంకట సుబ్బయ్య లంచగొండి అవతారం ఎత్తారు. జామీన్ పత్రాలపై సంతకాలు చేసేందుకు రూ.2వేలు లంచం కావాలని డిమాండ్ చేశారు. వెంకట సుబ్బయ్య తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన బాధితులు ఎంపీడీవో కార్యాలయంలోనే 2వేలు ముట్టజెప్పారు. అనంతరం నేను ఇంతగడ్డి తిన్నానని సంతకం పెడతావా..? లేదా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామస్థుల తీరుతో బిత్తరపోయిన సహచర ఉద్యోగులు వారిని సర్ధి చెప్పే ప్రయత్నం చేశారు. బాధితుల ఫిర్యాదుతో పంచాయితీ సెక్రటరీపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

