కరోనా వైరస్ ప్రపంచాన్ని అతలాకుతలం చేసింది. ఆర్ధికంగా ఎంతో దెబ్బతీసింది. దీంత ఆదాయం పెంచుకునేందుకు రాజస్థాన్ లోని జైపూర్ మెట్రో సరికొత్త ఆలోచన చేపట్టింది. ఆదాయం సమకూర్చుకునేందుకు సిద్ధమైంది. చిన్నపాటి ప్రకటనల షూటింగ్ లకు ఇప్పటికే అద్దెకిస్తోన్న మెట్రో.. ఇప్పుడు తాజాగా బర్త్ డే వేడుకలకు, ఇతర కార్యక్రమాలకు గంటల చొప్పున రెంట్ కు ఇవ్వనున్నట్లు తెలిపింది.
ఒక కోచ్ ను తీసుకోవాలనుకునే వారు గంటకు 5వేల రూపాయలు చెల్లించాల్సి ఉంటుందని మెట్రో అధికారులు తెలిపారు. అనుకున్న దానికంటే సమయం మించితే ప్రతి గంటకు అదనంగా వెయ్యి చొప్పున వసూలు చేయనున్నట్లు చెప్పారు. ఇప్పటికే ఓ ఈవెంట్ మేనేజ్మెంట్ కూడా మెట్రో సంస్థతో అగ్రిమెంట్ కుదుర్చుకున్నట్లు తెలుస్తోంది.
