తండాలో తప్పని నీటి కష్టాలు

 గండీడ్,  వెలుగు : మహమ్మదాబాద్ మండలంలో అనుబంధ గ్రామాల్లో నీటి సమస్యతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.  శేఖపల్లి గ్రామపంచాయతీ అనుబంధగ్రామమైన దాడితండాలో తాగునీరుకోసం గిరిజనులు అవస్తులు పడుతున్నారు.  మిషన్ భగీరథనీటి ట్యాంకు ఉన్నా రెండు నెలలుగా నీరు సరిగ్గా రావడంలేదని తండావాసులు ఆవేదన వ్యక్తంచేశారు. 

 సింగిల్​ ఫేస్​  బోర్ మోటార్, సోలార్ బోర్​ మోటార్ ఉన్నా అవి పనిచేయడంలేదు. దీంతో తండా సమీపంలోని  వ్యవసాయ    బావి నుంచి రోజూ నీళ్లు తెచ్చుకుంటున్నారు.  అధికారులు స్పందించి మోటార్లు బాగు చేయించాలని వారు కోరతున్నారు.