హైదరాబాద్‌‌లో పెన్నార్ ప్లాంట్

హైదరాబాద్‌‌లో పెన్నార్ ప్లాంట్

ప్రముఖ ఇంజనీరింగ్ కంపెనీ పెన్నార్ ఇండస్ట్రీస్ హైదరాబాద్‌‌లో గ్రీన్‌‌ఫీల్డ్ ప్లాంట్‌‌ను ఏర్పాటు చేయనున్నట్టు ప్రకటించింది. తన సీడీడబ్ల్యూ ట్యూబ్స్ కెపాసిటీని రెండింతలు పెంచడానికి దీనిని నిర్మిస్తామని తెలిపింది. కోల్డ్ డ్రాన్ వెల్డెడ్(సీడీడబ్ల్యూ) ట్యూబ్‌‌లను సప్లయి చేయడంలో పెన్నార్ ఇండస్ట్రీస్ అగ్రస్థానంలో ఉంది. ఈ ట్యూబ్‌‌లను ఆటో, కన్‌‌స్ట్రక్షన్ ఈక్విప్‌‌మెంట్ రంగాల్లో వాడతారు.  ప్రస్తుతం నెలకు 1500 మెట్రిక్ టన్నుల సీడీడబ్ల్యూ ట్యూబ్‌‌లను పెన్నార్ ఇండస్ట్రీస్ తయారు చేస్తోంది. ఈ కొత్త ఫెసిలిటీ ద్వారా 150 ఎంఎ డయామీటర్ వరకు సీడీడబ్ల్యూ ట్యూబ్‌‌లను ఉత్పత్తి చేయనుంది. నెలకు 3,000 మెట్రిక్ టన్నుల కెపాసిటీని చేరుకోవడానికి కంపెనీకి రూ.65 కోట్ల మూలధనం అవసరమవుతుందని కంపెనీ చెప్పింది. కొత్త ప్లాంట్ 2020 జూన్ నుంచి ఆపరేషనల్‌‌గా అందుబాటులోకి రానుంది.