అమెరికా స్పీకర్‌‌గా నాలుగోసారి పెలోసీ

అమెరికా స్పీకర్‌‌గా నాలుగోసారి పెలోసీ
వాషింగ్టన్: అమెరికా ప్రతినిధుల సభ స్పీకర్ గా డెమొక్రటిక్ లీడర్ నాన్సీ ప్యాట్రీసియా పెలోసీ (80) తిరిగి ఎన్నికయ్యారు. ప్రతినిధుల సభకు ఎన్నికైన ఏకైక మహిళా స్పీకర్ గా హిస్టరీ క్రియేట్ చేసిన పెలోసీ.. నాలుగోసారి ఈ పదవిని చేపట్టనున్నారు. అమెరికా117వ కాంగ్రెస్ లో హౌజ్ ఆఫ్​ రిప్రజెంటే టివ్స్ స్పీకర్ ఎన్నికకు ఆదివారం జరిగిన ఓటింగ్ లో రిపబ్లికన్ లీడర్ కెవిన్ మెక్ క్యార్తీపై పెలోసీ స్వల్ప ఓట్ల తేడాతో గెలుపొందారు. కెవిన్ కు 209 ఓట్లు రాగా, పెలోసీకి 216 ఓట్లు వచ్చాయి. అయితే కెవిన్‌కు రిపబ్లికన్ నేతలందరూ ఓటేశారు. పెలోసీకి మాత్రం ఆరుగురు సొంత పార్టీ నేతలే మద్దతు ఇవ్వలేదు. కాగా, న్యాన్సీ పెలోసీ 2003 నుంచి ప్రతినిధుల సభలో డెమొక్రాట్ల లీడర్ గా ఉన్నారు. 2007లో ప్రతినిధుల సభకు తొలి మహిళా స్పీకర్‌గా ఎన్నికై చరిత్ర సృష్టించారు. For More News.. బాల్య వివాహం వద్దని పారిపోయి పైలట్ అయ్యింది ఇంటర్ పాసైతే స్కూటీ గిఫ్ట్.. స్కూల్‌కి వెళ్తే రోజుకి వంద డిజిటల్‌ కరెన్సీకి పెరుగుతున్న ప్రాధాన్యత