చిన్నారి ప్రాణాల మీదకు తెచ్చిన క్యారెట్..బ్రాంకోస్కోపీ ద్వారా కాపాడిన వైద్యులు

కొత్తకోట, వెలుగు : క్యారెట్ ముక్క ఊపిరితిత్తుల మధ్యలో ఇరుక్కొని ఊపిరాడక స్పృహ కోల్పోయిన ఏడాది చిన్నారిని పీడియాట్రిక్ ​బ్రాంకో స్కోపీ ద్వారా వైద్యులు కాపాడారు. కొత్తకోటకు చెందిన జహిర్​ దంపతుల రెండో కుమార్తె ఫిజ్జా క్యారెట్ తిని ఉక్కిరిబిక్కిరి కావడంతో కుటుంబ సభ్యులు హుటాహుటిన స్థానికి రాహుల్​ ఆస్పత్రికి తరలిచారు. ఊపిరితిత్తుల మధ్య క్యారెట్​ముక్క ఇరుక్కున్నట్లు గుర్తించిన వైద్యులు..

వెంటిలేటర్ ద్వారా​కృతిమ శ్వాస అందించారు. అనంతరం ​ పల్మోనాలజిస్ట్​ వెంకట్ రెడ్డి బృందం బ్రాంకోస్కోపీ చేసి చిన్నారి ప్రాణాలను కాపాడింది. దాదాపు 48 గంటలపాటు ఈ ట్రీట్మెంట్ చేసినట్లు వైద్యులు తెలిపారు. వనపర్తి జిల్లాలో బ్రాంకోస్కోపీ సర్జరి చేయడం ఇదే తొలిసారని పేర్కొన్నారు.