లోక్సభ ఎన్నికల్లో బీఆర్ ఎస్, బీజేపీ ఒక్కటయ్యాయి: పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ

మంచిర్యాల: లోక్ సభ ఎన్నికల్లో బీఆర్ ఎస్, బీజేపీ ఒక్కటయ్యాయని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ అన్నారు.  కవితను జైలు నుంచి తీసుకురావడానికే బీఆర్ఎస్ ,బీజేపీతో కలిసిందన్నారు. బీ ఆర్ఎస్, బీజేపీ ప్రభుత్వాలు అహంకారంతో ప్రజలను ఇబ్బందులకు గురి చేశాయని అన్నారు. అయినా కాంగ్రెస్ అధిక సీట్లు సాధించిందన్నారు. 

పెద్దపల్లిలో ఎంపీగా తనను గెలిపించేందుకు కృషి చేసిన మంత్రి శ్రీధర్ బాబుకు , తన గెలుపులో భాగమైన ప్రతి ఒక్కరికి ధన్యావాదాలు తెలిపారు. కాంగ్రెస్ ప్రజాపాలనలో కార్యకర్తలను కాపాడుకుం టామన్నారు.పెద్దపల్లి ప్రాంతంలో యువత ఉపాధి అవకాశాలకోసం పరిశ్రమలు తీసుకొస్తానన్నారు ఎంపీ గడ్డం వంశీకృష్ణ. 

దేశ ప్రజలు మోదీని నమ్మలేదు: ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి 

దేశ ప్రజలు మోదీని, బీజేపీని నమ్మలేదని.. అందుకే సాధారణ మెజార్టీ కూడా ఇవ్వలేదని చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి . చెన్నూరుపట్టణంలో పెద్దపల్లి ఎంపీగా గెలిచిన గడ్డం వంశీకృష్ణతో కలిసి మీడియా సమావేశంలో పాల్గొన్నారు. పెద్దపల్లి పార్లమెంట్ కాకా వెంకటస్వామి వారసుడిగా గడ్డం వంశీని భారీ మెజార్టీతో గెలిపించినందుకు ధన్యవాదాలు తెలిపారు. హామీ ఇచ్చినట్లుగానే ఆగస్టు 15 లోపు సీఎం రేవంత్ రెడ్డి తప్పకుండా రుణమాఫీ చేస్తారని అన్నారు. 

మోదీ ప్రభుత్వం.. ప్రతిపక్ష నాయకులను ఈడీ, సీబీఐ వంటి కేంద్ర దర్యాప్తు సంస్థలను ఉపయోగించుకొని బెదిరించారని ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి అన్నారు. మోది సర్కార్ 400 సీట్లు గెలుస్తామని గ్లోబల్ ప్రచారం చేశారు.కానీ దేశ ప్రజలు మోదీని నమ్మలేదు..కనీసం సాధారణ మెజారిటీ సీట్లను కూడా ఇవ్వలేదని అన్నారు.  తెలంగాణను ఏ విధంగా లక్ష కోట్ల రూపాయల అప్పుల రాష్ట్రంగా మార్చారో.. మోదీ ప్రభుత్వం దేశాన్ని 88 లక్షల కోట్ల నుంచి 155 లక్షల కోట్ల రూపాయల అప్పుల ఊబిలో నెట్టారని అన్నారు.