కాకా స్ఫూర్తితోనే రాజకీయాల్లోకి వచ్చా : ఎంపీ వంశీకృష్ణ

కాకా పోరాటంతోనే నిరుపేదలకు ఇండ్లు వచ్చాయన్నారు  పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీ కృష్ణ అన్నారు. కాకా ఎన్ని కష్టాలు వచ్చినా వెనక్కి తగ్గలేదన్నారు. హైదరాబాద్ లోని  డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఎడ్యుకేషనల్ ఇన్ స్టిట్యూషన్స్ లో గోల్డెన్ జూబ్లీ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఎంపీ వంశీకృష్ణ.. అంబేద్కర్ కాలేజ్ నుంచి 2 లక్షల మంది గ్రాడ్యుయేట్స్ అయ్యారని అన్నారు. పేదలు, బడుగులకు న్యాయం జరగాలని కాకా తపించేవారని చెప్పారు. అన్ని రంగాలకు కాకా స్ఫూర్తి ప్రదాత అని అన్నారు.50 ఏళ్లలో ఎంతోమంది విద్యావంతులు అయ్యారని చెప్పారు. రాజ్యాంగ పరిరక్షణకు కాకా కృషి చేశారని అన్నారు. అంబేద్కర్ స్ఫూర్తితో కాకా రాజకీయాల్లోకి వచ్చారని తెలిపారు. ఢిల్లీలో సొంతింటిని కాకా కాంగ్రెస్ పార్టీకీ ఇచ్చారని చెప్పారు వంశీ. 

కాకా వెంకటస్వామి వర్థంతి సందర్భంగా డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఎడ్యుకేషనల్ ఇన్ స్టిట్యూషన్స్ లో గోల్డెన్ జూబ్లీ వేడుకలకు ముఖ్య అతిథిలుగా స్పీకర్ గడ్డం ప్రసాద్, రాష్ట్ర మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొన్నం ప్రభాకర్,  ఎమ్మెల్యేలు నాగరాజు, వివేక్ వెంకటస్వామి, ఎంపీ గడ్డం వంశీకృష్ణ, అంబేద్కర్ కాలేజీల సెక్రటరీ వినోద్, కరస్పాండెంట్ డాక్టర్ సరోజ హాజరయ్యారు.