స్టూడెంట్లకు క్రికెట్ ​కిట్ ​పంపిన ఎంపీ గడ్డం వంశీ కృష్ణ

జైపూర్, వెలుగు: జైపూర్ మండల కేంద్రంలోని జడ్పీహై స్కూల్ స్టూడెంట్లకు పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ క్రికెట్​ కిట్ ​అందజేశారు. కొద్దిరోజుల క్రితం ఎంపీ వంశీకృష్ణ మంచిర్యాలలో మార్నింగ్ వాక్ టైమ్​లో కలిసిన స్కూల్ ఫిజికల్ డైరెక్టర్ గోపాల్.. స్టూడెంట్ల క్రికెట్ కిట్ అవసరం ఉందని చెప్పారు. స్పందించిన ఎంపీ రెండ్రోజుల క్రితం హైదరాబాద్ లో గోపాల్​కు రూ.15 వేల విలువైన క్రికెట్ కిట్ అందజేశారు. 

శుక్రవారం క్రికెట్ కిట్ ను హెచ్ఎం.శ్యామ్ స్కూల్ స్టూడెంట్లకు అందచేశారు. హెచ్ఎం మాట్లాడుతూ క్రికెట్ లో రాణిస్తున్న స్టూడెంట్లను ప్రోత్సహించేందుకు వివరాలను ఎంపీ అడిగి తెలుసుకున్నారని ఆన్నారు. కిట్ అందజేసిన ఎంపీకి ధన్యవాదాలు తెలిపారు.