అమిత్ షా సిగ్గు లేకుండా, మతితప్పి మాట్లాడారు.. హోంమంత్రి పదవికి రాజీనామా చెయ్యాలి: ఎంపీ గడ్డం వంశీకృష్ణ

మంగళవారం ( డిసెంబర్ 17, 2024 ) రాజ్యసభలో అంబేద్కర్ ను ఉద్దేశించి కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలపై మండిపడ్డారు పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ. అమిత్ షా వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నానని.. దళితులంతా ఏకమై అమిత్ షా కు చెంపపెట్టులాంటి సమాధానం ఇవ్వాలని అన్నారు వంశీకృష్ణ. అమిత్ షా సిగ్గు లేకుండా, మతితప్పి మాట్లాడారని.. ఇలాంటి సంకుచిత మనస్తత్వం తో మాట్లాడే వ్యక్తి దేశానికి హోంమంత్రి గా పనిచేయడం దౌర్భాగ్యమని అన్నారు.

దేవుడి పేరు కూడా అంబేద్కర్ పేరు లాగా జపం చేస్తే స్వర్గానికి పోతామంటూ చిన్నచూపుగా మాట్లాడారని.. హోంమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటని అన్నారు. అమిత్ షా దళితులకు భేషరత్ గా క్షమాపణలు చెప్పి, తన హోంమంత్రి పదవికి రాజీనామా చెయ్యాలని డిమాండ్ చేశారు వంశీకృష్ణ. అమిత్ షా కు జైలుకు వెళ్లివచ్చిన రోజులను ప్రజలు మళ్ళీ గుర్తు చేయాలని అన్నారు.

Also Read:-మహా కుంభమేళాలో.. తిరుమల వెంకన్న నమూనా ఆలయం..