బదిలీ అయిన టీచర్లకు సన్మానం

పెబ్బేరు, వెలుగు : రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల స్కూళ్లలో బదిలీలు చేపట్టగా పెబ్బేరు జడ్పీహెచ్​ఎస్​ బాలికల పాఠశాలలో బదిలీపై వెళ్లిన టీచర్లకు వీడ్కోలు సమావేశాన్ని నిర్వహించారు. పదోన్నతి పై హిందీ పండిట్ శ్రీలత బదిలీ కాగా శైలజ, శ్రీరంజని   వేరే పాఠశాలకు బదిలీ అయ్యారు.

వీరి ముగ్గురిని పాఠశాలలోని ఇతర టీచర్లు, విద్యార్థులు ఘనంగా సన్మానించి వీడ్కోలు పలికారు. కార్యక్రమంలో హెచ్ఎం విజయలక్ష్మి, ఉపాధ్యాయులు వరలక్ష్మి, కమల, సుమిత్ర, శాంతాబాయి, భాగ్య చంద్రిక, రాధా రాణి, భారతి తదితరులు పాల్గొన్నారు