- పీసీసీ అధికార ప్రతినిధి దామోదర్ రావు
గద్వాల, వెలుగు: కాంగ్రెస్ ప్రభుత్వం పేదల సంక్షేమం కోసమే కృషి చేస్తోందని పీసీసీ అధికార ప్రతినిధి దామోదర్ రావు అన్నారు. శనివారం ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి నివాసంలో ఆయన ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ.. కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చి ఏడాది పాలన సక్సెస్ ఫుల్ గా కంప్లీట్ చేసిందన్నారు.
దేశ చరిత్రలో ఎన్నడు లేని విధంగా రైతులకు రూ.21 వేల కోట్ల రుణమాఫీ చేశామన్నారు. రాబోయే స్థానిక సంస్థ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ విజయకేతనం ఎగరవేస్తుందన్నారు. అధికార ప్రతినిధి దామోదర్ రావు ముందే కాంగ్రెస్ పార్టీ నాయకుడు గట్టు తిమ్మప్ప అసమ్మతి గళం వినిపించారు. పార్టీ ఇన్చార్జి సరిత తమకు చెప్పకుండానే కార్యక్రమాలు చేస్తున్నారని ఫిర్యాదు చేశారు.