పాక్ క్రికెటర్ ఉమర్ అక్మల్ పై మూడేళ్ల పాటు వేటు పడింది.
ఫిక్సింగ్ కోసం సంప్రదింపులు జరిగినా తమకు ఫిర్యాదు చేయకపోవడంతో పాకిస్థాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ) అక్మల్ పై వేటు వేసింది . ఈ ఏడాది ఫిబ్రవరి 20వ తేదీన పాకిస్థాన్ సూపర్ లీగ్(పీఎస్ఎల్) ప్రారంభం అవడానికి కొద్ది గంటల ముందే అక్మల్‌ను పీసీబీ సస్పెండ్ చేసింది. విచారణ జరిపి గత నెల 17న పీసీబీ అవినీతి నిరోధక విభాగం అతడిపై అభియోగాలను నమోదు చేసింది. వీటిపై అక్మల్ అప్పీలు కూడా చేసుకోలేదు. దీంతో పీసీబీ డిసిప్లెనరీ ప్యానెల్ ఉమర్ అక్మల్‌పై మూడేండ్ల నిషేధాన్ని విధిస్తూ నిర్ణయం తీసుకుంది.
అక్మల్ కెరీర్లో ఆట కంటే వివాదాల కారణంగా అక్మల్ ఎక్కువగా వార్తల్లో నిలిచాడు. ఈ ఏడాది ఫిబ్రవరిలో లాహోర్‌లోని జాతీయ క్రికెట్ అకాడమీలో ఫిట్నెస్ ట్రైనర్తోనూ అక్మల్ అసభ్యకరంగా ప్రవర్తించాడు.
