Pakistan Cricket: పాకిస్థాన్ క్రికెట్‌లో మరో వింత.. కెప్టెన్ లేకుండానే జట్ల ప్రకటన

వింతలు, విశేషాలకు కేంద్ర  బిందువు పాక్ క్రికెట్. ఆ దేశ జాతీయ క్రికెట్ లో ఏరోజు ఎలాంటి ఘటనలు చోటుచేసుకుంటాయో.. ఎటువంటి నిర్ణయాలు వెలుబడతాయో ఎవరూ ఊహించలేం. అందుకు ఈ ప్రకటనే నిదర్శనం. కెప్టెన్ ఎవరనేది చెప్పకుండానే పాకిస్తాన్ క్రికెట్ బోర్డు(PCB).. ఆస్ట్రేలియా, జింబాబ్వే పర్యటనలకు జట్లను ప్రకటించింది. రాబోయే ఆస్ట్రేలియా, జింబాబ్వే టూర్‌ల కోసం పీసీబీ ఆదివారం వేరు వేరు జట్లను ప్రకటించింది. ఈ జట్లకు నాయకుడు లేడు. 

3 వన్డేలు.. 3 టీ20లు

పాకిస్థాన్ జట్టు నవంబర్ 03 నుండి నవంబర్ 17 వరకు ఆస్ట్రేలియాలో పర్యటించనుంది. ఈ టూర్‌లో ఇరు జట్ల మధ్య వన్డే, టీ20 సిరీస్ జరగనుంది. నవంబర్ 04, 08, 10 తేదీలలో టీ20లు.. నవంబర్ 14, 16, 18 తేదీలలో వన్డేలు జరగనున్నాయి. 

వారం రోజుల గ్యాప్..

ఆసీస్ పర్యటన ముగిసిన వారం రోజుల అనంతరం పాకిస్థాన్ జట్టు.. జింబాబ్వే పర్యటనకు వెళ్లనుంది. ఈ టూర్‌లో ఇరు జట్ల మధ్య మూడు వన్డేలు, మూడు టీ20లు జరగనున్నాయి. నవంబర్ 24, 26, 28 తేదీలలో వన్డేలు.. డిసెంబర్ 01, 03, 05 తేదీలలో టీ20లు జరగనున్నాయి. 

ఇంగ్లండ్‌తో జరిగిన చివరి రెండు టెస్టులకు దూరమైన బాబర్ ఆజం, నసీమ్ షా, షాహీన్ షా ఆఫ్రిదిలు ఆస్ట్రేలియా పర్యటనలో చోటుదక్కించుకోగా.. జింబాబ్వే పర్యటనకు దూరంగా ఉండనున్నారు.

ఆస్ట్రేలియా పర్యటనకు వన్డే జట్టు: అమీర్ జమాల్, అబ్దుల్లా షఫీక్, అరాఫత్ మిన్హాస్, బాబర్ ఆజం, ఫైసల్ అక్రమ్, హరీస్ రవూఫ్, హసీబుల్లా (వికెట్ కీపర్), కమ్రాన్ గులామ్, మహ్మద్ హస్నైన్, మహ్మద్ రిజ్వాన్ (వికెట్ కీపర్), ముహమ్మద్ ఇర్ఫాన్ ఖాన్, నసీమ్ షా, సల్మాన్ అయూబ్, సల్మాన్ ఆఘా, షాహీన్ షా అఫ్రిది

ఆస్ట్రేలియా పర్యటనకు పాక్ టీ20 జట్టు: అరాఫత్ మిన్హాస్, బాబర్ ఆజం, హరీస్ రవూఫ్, హసీబుల్లా, జహందాద్ ఖాన్, మహ్మద్ అబ్బాస్ ఆఫ్రిది, మహ్మద్ రిజ్వాన్ (వికెట్ కీపర్), ముహమ్మద్ ఇర్ఫాన్ ఖాన్, నసీమ్ షా, ఒమైర్ బిన్ యూసుఫ్, సాహిబ్జాదా ఫర్హాన్, సల్మాన్ ఆఘా, సాహిబ్జాదా ఫర్హాన్, సల్మాన్ అలీ అఘా మొకిమ్, ఉస్మాన్ ఖాన్.

ALSO READ | AUS vs PAK 2024: బాబర్ అజామ్‌కు సపోర్ట్.. పాక్ జట్టులో చోటు కోల్పోయిన ఫఖర్ జమాన్

జింబాబ్వే పర్యటనకు వన్డే జట్టు: అమీర్ జమాల్, అబ్దుల్లా షఫీక్, అబ్రార్ అహ్మద్, అహ్మద్ డానియాల్, ఫైసల్ అక్రమ్, హరీస్ రవూఫ్, హసీబుల్లా (వికెట్ కీపర్), కమ్రాన్ గులామ్, మహ్మద్ హస్నైన్, మహ్మద్ రిజ్వాన్ (వికెట్ కీపర్), ముహమ్మద్ ఇర్ఫాన్ ఖాన్, సైమ్ అయూబ్, సల్మాన్ అయూబ్, సల్మాన్ దహానీ, తయ్యబ్ తాహిర్.

జింబాబ్వే పర్యటనకు పాక్ టీ20 జట్టు: అహ్మద్ డానియాల్, అరాఫత్ మిన్హాస్, హరీస్ రవూఫ్, హసీబుల్లా (WK), జహందాద్ ఖాన్, మహ్మద్ అబ్బాస్ అఫ్రిది, మహ్మద్ హస్నైన్, ముహమ్మద్ ఇర్ఫాన్ ఖాన్, ఒమైర్ బిన్ యూసుఫ్, ఖాసిమ్ అక్రమ్, సాహిబ్జాదా తాలి అఘాన్, సల్మాన్ అఘాన్, సల్మాన్, మరియు ఉస్మాన్ ఖాన్

ఆస్ట్రేలియా vs పాకిస్తాన్ షెడ్యూల్:

  • తొలి వన్డే (నవంబర్ 04): మెల్బోర్న్
  • రెండో వన్డే (నవంబర్ 08): అడిలైడ్
  • మూడో వన్డే (నవంబర్ 10): పెర్త్
  • తొలి టీ20 (డిసెంబర్ 14): బ్రిస్బేన్
  • రెండో టీ20 (డిసెంబర్ 16): సిడ్నీ
  • మూడో టీ20 (డిసెంబర్ 18): హోబర్ట్

పాకిస్తాన్ vs జింబాబ్వే షెడ్యూల్

  • తొలి వన్డే (నవంబర్ 24): బులవాయో
  • రెండో వన్డే (నవంబర్ 26): బులవాయో
  • మూడో వన్డే (నవంబర్ 28): బులవాయో
  • తొలి టీ20 (డిసెంబర్ 01): బులవాయో
  • రెండో టీ20 (డిసెంబర్ 03): బులవాయో
  • మూడో టీ20 (డిసెంబర్ 05): బులవాయో