పేటీఎం ఐపీఓలో పెట్టుబడి పెట్టొచ్చా?

పేటీఎం ఐపీఓలో పెట్టుబడి పెట్టొచ్చా?
  • లిస్టింగ్​ గెయిన్స్​ కష్టమంటున్న ఇన్వెస్ట్‌‌‌‌‌‌‌‌మెంట్ మేనేజర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రాఖీ ప్రసాద్‌‌‌‌‌‌‌‌

న్యూఢిల్లీ: అతిపెద్ద ఐపీఓ అయిన పేటీఎం ఇన్వెస్టర్లకు లిస్టింగ్‌‌‌‌‌‌‌‌ రోజు లాభాలను తెచ్చిపెట్టలేక పోవచ్చని ఆల్డర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ క్యాపిటల్‌‌‌‌‌‌‌‌ ఇన్వెస్ట్‌‌‌‌‌‌‌‌మెంట్ మేనేజర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రాఖీ ప్రసాద్ అభిప్రాయపడ్డారు. ఈ పబ్లిక్ ఇష్యూలో ఇన్వెస్ట్ చేయడం ‘హై రిస్క్’ అని  పేర్కొన్నారు. ‘మర్చంట్స్‌‌‌‌‌‌‌‌ పరంగా చూస్తే పేటీఎంకు అతిపెద్ద నెట్‌‌‌‌‌‌‌‌వర్క్ ఉంది. లాభాలను జనరేట్ చేయడానికి కంపెనీకి టైమ్ పడుతుంది’ అని బ్లూమ్‌‌‌‌‌‌‌‌బర్గ్ టీవీ ఇంటర్వ్యూలో ఆమె పేర్కొన్నారు. షార్ట్‌‌‌‌‌‌‌‌టెర్మ్‌‌‌‌‌‌‌‌లో ఏం జరగపోవచ్చని, కానీ, మీడియం, లాంగ్‌‌‌‌‌‌‌‌టెర్మ్‌‌‌‌‌‌‌‌కు చూసుకుంటే పేటీఎంలో ఇన్వెస్ట్ చేయడం రిస్క్‌‌‌‌‌‌‌‌తో కూడుకున్నదని అభిప్రాయపడ్డారు. ఇతర ఐపీఓలకు వచ్చినట్టే ఈ ఐపీఓకి లిస్టింగ్ లాభాలు ఉండకపోవచ్చని అంచనావేశారు. పేటీఎం ఐపీఓ ఈ నెల 8 న ఓపెన్ అయ్యింది. బుధవారం (10 న) ముగుస్తుంది.

ఐపీఓలో షేరు ధర రూ. 2,080–2,150 గా ఉంది. వాల్యుయేషన్ 19.5–20 బిలియన్ డాలర్ల దగ్గర  2.5 బిలియన్ డాలర్ల( రూ. 18,300 వేల కోట్ల) ను సేకరించాలని కంపెనీ చూస్తోంది. మొదటి రోజు 18 శాతం , రెండో రోజు నాటికి 48 శాతం సబ్‌‌‌‌‌‌‌‌స్క్రిప్షన్‌‌‌‌‌‌‌‌ను ఈ పబ్లిక్‌‌‌‌‌‌‌‌ ఇష్యూ దక్కించుకుంది. ఇంకా పెద్ద ఇన్వెస్టర్లు పేటీఎం ఐపీఓకి సబ్‌‌‌‌‌‌‌‌స్క్రయిబ్‌‌‌‌‌‌‌‌ అయినట్టు కనిపించడం లేదు.  ప్రీ ఐపీఓకి మాత్రం పెద్ద ఇన్వెస్టర్లు ఎక్కువ ఆసక్తి చూపించారు.  బ్లాక్‌‌‌‌‌‌‌‌రాక్‌‌‌‌‌‌‌‌, అబుదాబీ ఇన్వెస్ట్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌ అథారిటీ, సాఫ్ట్‌‌‌‌‌‌‌‌బ్యాంక్ సీఈఓ మసయోషి సన్‌‌‌‌‌‌‌‌ పేటీఎం ఐపీఓపై బుల్లిష్‌‌‌‌‌‌‌‌గా ఉన్నారు. ప్రస్తుతం ఇండియన్ ఐపీఓ మార్కెట్‌‌‌‌‌‌‌‌లో టెక్నాలజీ యూనికార్న్‌‌‌‌‌‌‌‌లకు ఫుల్‌‌‌‌‌‌‌‌ డిమాండ్ క్రియేట్‌‌‌‌‌‌‌‌ అవుతోంది. జొమాటో, నైకా వంటి కంపెనీల ఐపీఓకి ఫుల్‌‌‌‌‌‌‌‌ రెస్పాన్స్ వచ్చింది.   కాగా, పేటీఎంకు దేశంలో  గూగుల్‌‌‌‌‌‌‌‌ పే, వాల్‌‌‌‌‌‌‌‌మార్ట్‌‌‌‌‌‌‌‌కు చెందిన ఫోన్‌‌‌‌‌‌‌‌పేల నుంచి తీవ్ర పోటీ ఎదురవుతోంది. దేశ మొబైల్‌‌‌‌‌‌‌‌ పేమెంట్స్ మార్కెట్ 2024 నాటికి రూ. 150 లక్షల కోట్లకు పెరుగుతుందని అంచనా.