భారత్ లో పేపాల్ సేవల్ బంద్

భారత్ లో పేపాల్ సేవల్ బంద్

ఇండియాలో తన సొంత కార్యకలాపాలను నిలిపివేయాలని అమెరికా సంస్థ పేపాల్ నిర్ణయించింది. ఏప్రిల్ 1 నుంచి ఈ వ్యాపారాల నుంచి తప్పుకుంటున్నట్లు కంపెనీ ప్రకటించింది. ఇక నుంచి ఇండియాలో తన సొంత కార్యకలాపాలు ఉండవని, అయితే.. అంతర్జాతీయ లావాదేవీలు మాత్రం కొనసాగుతాయని తెలిపింది. ప్రపంచంలో ఎక్కడి నుంచైనా దేశంలో చెల్లింపులు చేసుకునే సౌకర్యం ఉంటుందని తెలిపింది. మేక్‌ మై ట్రిప్, ఆన్‌లైన్ ఫిల్మ్ బుకింగ్ వంటి బుక్‌మై షో, స్విగ్గీ యాప్‌లకు పేపాల్ ద్వారా ఇపుడు చెల్లింపులు చేసే అవకాశముంది. ఏప్రిల్ 1 తర్వాత ఈ సేవలు ఇండియాలో నిలిచిపోనున్నాయి.