- ఫ్రీడం ఫైటర్లకు డిజిటల్ నివాళి
- పాల్గొనాలంటూ ప్రజలకు ప్రధాని విజ్ఞప్తి
న్యూఢిల్లీ: ఫ్రీడం ఫైటర్లకు డిజిటల్ నివాళులు అర్పించడంలో భాగస్వాములు కావాలంటూ ప్రధాని నరేంద్ర మోడీ దేశ ప్రజలను కోరారు. "ఢిల్లీలోని సెంట్రల్ పార్క్ వద్ద స్కై బీమ్ లైట్ ఏర్పాటుచేశాం. ఆన్‌లైన్‌లో వచ్చే ప్రతి నివాళి.. డిజిటల్ జ్యోతి ప్రకాశాన్ని మరింత పెంచుతుంది.
ఈ ప్రత్యేకమైన కార్యక్రమంలో దేశ ప్రజలందరూ పాల్గొనండి. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌ను విజయవంతం చేయండి" అని మోడీ ట్వీట్ చేశారు. "డిజిటల్ జ్యోత్" అనేది దేశ స్వాతంత్ర్య పోరాట వీరులకు ప్రత్యేక నివాళి అని చెప్పారు.
టెక్నాలజీ ద్వారా ఫ్రీడం ఫైటర్లకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసే ఈ అవకాశాన్ని ప్రజలు వినియోగించుకోవాలని ప్రధాని అన్నారు. digitaltribute.in. లింక్‌ను కూడా ఆయన షేర్ చేశారు.
