ఏపీ గవర్నర్ గా ప్రమాణ స్వీకారం చేసిన బిశ్వ భూషన్ హరిచందన్ కు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విషెస్ చెప్పారు. అపార రాజకీయ అనుభవం ఉన్నబిశ్వ భూషన్ ఏపీకి గవర్నర్ గా రావడం శుభ పరిణామం అన్నారు. విభజన హామీలు, ఆర్థిక లోటు, అభివృద్ధిలేమితో ఉన్న రాష్ట్రానికి గవర్నర్ అండగా ఉంటారని ప్రజలు ఆశిస్తున్నారని అన్నారు. గవర్నర్ పదవికి బిశ్వ భూషన్ వన్నె తెస్తారని ఆశిస్తున్నట్లు చెప్పారు.
