శనివారం విజయవాడలో సీఎం జగన్ పై జరిగిన రాళ్ల దాడి ఘటన రాష్ట్రంలో పెను దుమారం రేపుతోంది. ఈ ఘటన అధికార వైసీపీ, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్దానికి దారి తీసింది. ఈ దాడి వెనుక టీడీపీ కుట్ర ఉందని వైసీపీ ఆరోపిస్తుండగా ఇది వైసీపీ ఆడుతున్న డ్రామా అని టీడీపీ ఆరోపిస్తోంది. ఈ నేపథ్యంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ ఘటనపై తన ట్విట్టర్ ద్వారా సంచలన కామెంట్స్ చేశారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి మీద గులక రాయితో దాడి విషయంలో బాధ్యత వహించాల్సిన అధికారులతోనే విచారణ చేయిస్తే ఎలా? వివిఐపి కేటగిరీలో ఉన్నారనే కదా సదరు పాలకుడు ఏ ప్రభుత్వ కార్యక్రమానికి వెళ్ళినా పరదాలు కట్టి... చెట్లు కొట్టేసేవారు. అన్నీ పట్టపగలే నిర్వహించారు కదా. మరి ఏ ఉద్దేశంతో విజయవాడ…
— Pawan Kalyan (@PawanKalyan) April 15, 2024
సీఎం వీఐపీ కేటగిరిలో ఉన్నారు కాబట్టే కదా ఇదివరకు కార్యక్రమాలన్నీ చెట్లు కొట్టేసి, పరదాలు కట్టి పట్టా పగలే నిర్వహించారు కదా, విజయవాడలో కరెంట్ కట్ చేసి మరీ చీకట్లో యాత్ర నిర్వహించారని ప్రశ్నించారు. దర్యాప్తు జరుగుతున్న తీరుపై కూడా పవన్ అనుమానాలు వ్యక్తం చేశారు. ఈ ఘటనకు బాధ్యత వహించాల్సిన అధికారులతోనే ఎలా విచారణ చేయిస్తారని ప్రశ్నించారు.ఈ ఘటనలో సెక్యూరిటీ విఆఫల్యం ఏమిటో ఇంటెలిజెన్స్ తేల్చాలని కోరారు. దాడి గురించి ఇప్పటికే సోషల్ మీడియాలో వైసీపీ జనసేన మధ్య వార్ నడుస్తున్న క్రమంలో పవన్ ట్వీట్ ఏ పరిణామాలకు దారి తీస్తుందో చూడాలి.