పవన్ ట్వీట్‌పై తమిళనాడు అసెంబ్లీలో ప్రస్తావన

పవన్ ట్వీట్‌పై తమిళనాడు అసెంబ్లీలో  ప్రస్తావన

తమిళనాడు సీఎం స్టాలిన్ పనితీరును మెచ్చుకుంటూ జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ చేసిన ట్వీట్ ఆ రాష్ట్ర అసెంబ్లీలో చర్చకు వచ్చింది. అలాగే మెగాస్టార్ చిరంజీవి కూడా ఈ మధ్యే స్టాలిన్ ను కలిశారు. పవన్ ట్వీట్, చిరంజీవి ప్రకటనను అసెంబ్లీలో చదివి వినిపించారు హెల్త్ మినిస్టర్ సుబ్రమణిన్. రాజకీయ పార్టీలు అధికారంలోకి వచ్చేందుకు రాజకీయాలు చేయాలని... కానీ... అధికారంలోకి వచ్చాక రాజకీయం చేయకూడదన్నారు పవన్ కళ్యాణ్. ఈ  వ్యాఖ్యలను మంత్రి సుబ్రమణియన్ శాసనసభ్యులందరికీ చదివి వినిపించారు. ఆ వ్యాఖ్యల అర్థాన్ని తమిళంలో వివరించారు. ముఖ్యమంత్రిని చిరంజీవి కలిసిన వైనాన్ని కూడా ఆయన వెల్లడించారు. చిరంజీవిని తెలుగు నాట సూపర్ స్టార్ అని, పవన్ ను పవర్ స్టార్ అని పిలుస్తారని కూడా మంత్రి సుబ్రమణియన్ అసెంబ్లీలో అన్నారు.