2024 ఎన్నికల్లో జగన్ ను గద్దె దించటమే లక్ష్యంగా పొత్తు కుదుర్చుకున్న టీడీపీ, జనసేన పార్టీలు ఎట్టకేలకు బీజేపీతో పొత్తు కుదుర్చుకున్నాయి. ఢిల్లీలో సుదీర్ఘంగా సాగిన నిరీక్షణకు తెర పడింది. జనసేన, బీజేపీకి కలిపి 30అసెంబ్లీ సీట్లను, 5 లేదా 6ఎంపీ సీట్లను కేటాయించేందుకు బాబు డీల్ ఫిక్స్ చేశాడు. ఈ క్రమంలో మరో ఆసక్తికర అంశం తెరమీదికి వచ్చింది. పవన్ కళ్యాణ్ కాకినాడ నుండి ఎంపీగా పోటీ చేయనున్నాడని తెలుస్తోంది. వచ్చే ఎన్నికల్లో పవన్ అసెంబ్లీ, లోక్ సభ రెండు స్థానాల నుండి పోటీ చేస్తాడని సమాచారం అందుతోంది.
బీజేపీ పెద్దల సూచన మేరకు పవన్ ఈ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. అయితే, పవన్ పోటీ చేయబోయే అసెంబ్లీ స్థానం గురించి ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. రానున్న ఎన్నికల తర్వాత ఫలితం ఎలా వచ్చినా కూడా కేంద్రంలో, రాష్ట్రంలో తన ప్రభావం ఉండేలా పవన్ ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. టీడీపీ, జనసేనతో పొత్తుకు ఓకే చెప్పాలంటే 13 ఎంపీ సీట్లు డిమాండ్ చేసిన నేపథ్యంలో 6 స్థానాలకు ఒప్పించాడు చంద్రబాబు. మరి, పొత్తులో భాగంగా మూడు పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు ఏ రకంగా ఉండబోతుందో చూడాలి.