పవన్ కళ్యాణ్‌కు వదినమ్మ స్పెషల్ గిఫ్ట్.. వీడియో పోస్ట్ చేసిన మెగాస్టార్

జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కి.. మెగాస్టార్ చిరంజీవి సతీమణి కొణిదెల సురేఖ ఓ స్పెషల్ గిఫ్ట్ ఇచ్చారు. ఓ కలాన్ని(పెన్) బహుమతిగా ఇచ్చారు.

ప్రజా ప్రతినిధిగా, మంత్రిగా ప్రతి క్షణం ప్రజలతో మమేకమై ఉండే పవణ్.. తానిచ్చిన కలంతో 5 కోట్ల మంది ఆంధ్రులకు మంచి చేయాలనే సంకల్పంతో చిరు సతీమణి బతుమతిని అందజేశారు. లగ్జరీ పెన్ బ్రాండ్ మౌంట్ బ్లాక్‌కు చెందిన పెన్ గిఫ్ట్‌గా ఇచ్చారు. దీని ఖరీదు దాదాపు లక్ష రూపాయలు ఉండొచ్చనే ప్రచారం జరుగుతోంది. వదినమ్మ ఇచ్చిన బహుమతిని చూసి మెగాస్టార్ సోదరుడు మురిసిపోయారు. అందుకు సంబంధించిన వీడియోను చిరంజీవి సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు.

100 శాతం విజయాలు

ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ, బీజేపీతో కలిసి ఉమ్మడిగా పోటీ చేసిన జనసేన పార్టీ.. అభ్యర్థులను నిలబెట్టిన ప్రతి చోట విజయం సాధించింది. పోటీ చేసిన 21 స్థానాల్లోనూ గెలుపొందింది. దీంతో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు.. జనసేనానికి డిప్యూటీ సీఎం సహా పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, తాగునీటి సరఫరా శాఖల బాధ్యతలు అప్పగించారు.