ఏపీలో దుష్టపాలన అంతం కాబోతోంది - పవన్ కళ్యాణ్

టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఆధ్వర్యంలో చిలకలూరిపేటలో నిర్వహిస్తున్న ప్రజాగళం సభలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. మా కూటమికి దుర్గమ్మ ఆశీస్సులు ఉన్నాయని, 2014లో తిరుపతి వెంకన్న సాక్షిగా మూడు పార్టీల పొత్తు కుదిరిందని అన్నాడు.ఏపీలో ఎన్డీయే కూటమి అధికారంలోకి రాబోతుందని, ఏపీ ప్రజలు మోడీ రాక కోసం వేయి కళ్ళతో ఎదురు చూస్తున్నారని అన్నాడు. ప్రధాని మోడీ హ్యాట్రిక్ కొట్టబోతున్నారని, ఏపీలో దుష్టపాలన అంతం కాబోతుందని అన్నాడు.

ఏపీలో ఇసుక దోపిడీ యథేచ్ఛగా జరుగుతోందని అన్నాడు. అభివృద్ధి లేక ఏపీ అప్పుల్లో నాలుగుతోందని అన్నాడు. ధర్మం డే విజయం, పొత్తుదే గెలుపు, కూటమిదే పీఠం అని అన్నాడు. పవన్ కళ్యాణ్ ప్రసంగిస్తుండగా కొంతమంది యువకులు టవర్ పైకి ఎక్కగా ప్రధాని మోడీ కల్పించుకొని వారిని టవర్ దిగమని కోరడం ఆసక్తి కలిగించింది.పది లక్షల మంది జనంతో నిర్వహించాలని మూడు పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ సభ ఏ మేరకు సక్సెస్ అవుతుందో చూడాలి.