జగన్.. శివుడు మూడో కన్ను తెరిస్తే భస్మమై పోతావు.. పవన్ కళ్యాణ్

ఏపీలో అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలు కీలక దశకు చేరుకున్నాయి. నామినేషన్ల పర్వం కేసుల ముగియటంతో పార్టీలన్నీ ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డాయి. అధికార, ప్రతిపక్షాల మాటల యుద్ధంతో రాష్ట్రం రణరంగాన్ని తలపిస్తోంది. ఈ క్రమంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సీఎం జగన్ పై ఘాటైన వ్యాఖ్యలు చేశారు. శ్రీశైల మల్లికార్జున స్వామికి మహాకుంబాభిషేకాన్ని కావాలనే వాయిదా వేశారని, శివుడు మూడో కన్ను తెరిస్తే భస్మమైపోతారని అన్నారు.

మహాకుంబాభిషేకాన్ని వాయిదా వేయటానికి ఎండలను సాకుగా చూపుతున్నారని, అసలు కారణం వేరే ఉందని అన్నారు. మహాకుంబాభిషేకం చేస్తే జగన్ పదవి గండం ఉందని జ్యోతిష్యులు చెప్పారని అందుకే వాయిదా వేస్తున్నారని మండిపడ్డారు. శివుడు మూడో కన్ను తెరిస్తే భస్మమై పోతారని, మీరెంత మీ స్థాయి ఎంత అని ఆగ్రహం వ్యక్తం చేశారు పవన్. తరాలుగా వస్తున్న ఆచారాలను తుంగలో తొక్కారని, స్వార్థ ప్రయోగాజనాల కోసం వైసీపీ చాలా చేసిందని అన్నారు పవన్.